Cinema : 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే.. సరికొత్త రికార్డ్స్ సృష్టించిన మూవీ..

2025లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని రెస్పాన్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమా ఏంటో తెలుసా.. ? ఈ సంవత్సరం ఒక సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : 2025లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే.. సరికొత్త రికార్డ్స్ సృష్టించిన మూవీ..
Cinema (16)

Updated on: Nov 28, 2025 | 9:28 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అనేక కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ వసూల్లు రాబట్టిన చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కాంతార చాప్టర్ 1. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను భారీ బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్, చాలువే గౌడ్స్ నిర్మించారు. గతంలో బ్లాక్ బస్టర్ హిటైనా కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా ఈ మూవీని తీసుకువచ్చారు.ఈ చిత్రానికి సైతం ఊహించని రెస్పా్న్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.81.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది.

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. 2025లోనే అత్యధిక వసూల్లు రాబట్టిన భారతీయ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూల్లు రాబట్టిన 7వ సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 13వ సినిమాగా రికార్డుల్లోకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ముగిసింది. మొత్తం ఎనిమిది వారాలు థియేటర్లలో అలరించింది. ఎనిమిదో వారంలో దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసింది. భారత్ లో మొత్తం రూ.701 కోట్లు వసూలు కాగా.. ఓవర్సీస్ లో రూ.112.50 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే మొత్తం ఈ చిత్రానికి రూ.813.50 కోట్లు వసూల్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో కన్నడ సినిమాగా నిలిచింది. మొదటి స్థానంలో కేజీఎఫ్ 2 ఉంది. 2022లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. అలాగే కర్ణాటకలో రూ.235 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ.98.50 కోట్లు.. తమిళనాడులో రూ.69.50 కోట్లు.. కేరళలో రూ.55.50కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ. 701.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 112 కోట్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి :  Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..