Prabhas-Samantha: ఇంతవరకు ప్రభాస్, సమంత ఎందుకు కలిసి నటించలేదో తెలుసా? వీరిద్దరి కాంబోలో మిస్ అయిన మూవీ ఏదంటే?

ప్రభాస్- సమంత.. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ పాపులర్ స్టార్స్. ఇద్దరూ పాన్ ఇండియా నటులే. అభిమానగణం కూడా చాలా ఎక్కువే. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. ప్రభాస్, సమంతలు ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఉందని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

Prabhas-Samantha: ఇంతవరకు ప్రభాస్, సమంత ఎందుకు కలిసి నటించలేదో తెలుసా? వీరిద్దరి కాంబోలో మిస్ అయిన మూవీ ఏదంటే?
Samantha, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Oct 23, 2024 | 7:11 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సుదీర్ఘ కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. ఇక సమంత కూడా ప్రభాస్ లాగే పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ చిత్ర భాషల్లోని పలువురు స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. వీరిద్దరూ దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఇప్పటి వరకు కలిసి సినిమాల్లో నటించలేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రభాస్, సమంత కలిసి నటించాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. సమంత, ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న పోస్టులపై కూడా తరచూ ఇలాంటి కామెంట్లే వినిపిస్తుంటాయి. అయితే వీరిద్దరూ కలిసి నటించకపోవడానికి కారణం ప్రభాస్ హైట్. అవును, ప్రభాస్ 6 అడుగులు ఉంటే, సమంత హైట్ 5.2 అడుగులు. ఈ కారణంగానే వీరిద్దరితో కలిసి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘సాహో’ చిత్రంలో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, తమిళంలో విజయ్, విశాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది సమంత. ఇక ప్రభాస్ కూడా అనుష్క శెట్టి, కాజోల్, తమన్నా, త్రిష, శ్రేయ, ఇలియానా, కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, షూటింగ్ పనుల్లో బిజి బిజీగా ఉంటున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. అలాగే హను రాఘవ పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఏప్రిల్ 10న ‘ది రాజా సాబ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సాలార్ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇక సమంత విషయానికి వస్తే.. ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బానీ’ విడుదలకు సిద్ధమైంది. ఇక తెలుగులో ‘మా ఇంటి బంగారం’ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార. అలాగే మరాఠీ ‘తుంబాద్’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడి వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది సమంత.

ది రాజా సాబ్ లో ప్రభాస్ న్యూ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.