Rashmika Mandanna: తస్సాదియ్యా.. శ్రీవల్లి రేంజ్ మారింది.. పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంతంటే..

|

Nov 19, 2024 | 9:29 AM

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఇటీవలే పాట్నాలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహించింది చిత్రయూనిట్. అలాగే ఇప్పుడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప 2 ప్రమోషన్స్ నిర్వహించనున్నారు.

Rashmika Mandanna: తస్సాదియ్యా.. శ్రీవల్లి రేంజ్ మారింది.. పుష్ప 2 కోసం రష్మిక రెమ్యునరేషన్ ఎంతంటే..
పూజా హెగ్డే లాంటి బ్యూటీస్ ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాల్లో ఫ్లాష్ అయినా... బెస్ట్ పర్ఫామర్‌ అన్న పేరు రాలేదు. దీనికి తోడు పూజ నటించిన పాన్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఈ బ్యూటీ మెయిన్‌ స్ట్రీమ్‌ కాంపిటీషన్‌ లో లేకుండా పోయారు.
Follow us on

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే భారతీయ సినీరంగంలోకి టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆతర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా గీతా గోవిందం. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇక మూడేళ్ల క్రితం పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది రష్మిక.

సౌత్‏లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో పుష్ప సినిమా అదరగొట్టేసింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రష్మికకు పిలుపు వచ్చింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. యానిమల్ మూవీతో మరో హిట్టు అందుకుంది. ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ టీం సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు రష్మిక ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. త్వరలోనే యానిమల్ 2లోనూ నటించనుంది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.