
ఈ హైదరాబాదీ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ 8 ఏళ్లలో సుమారు 9 సినిమాలు చేసింది. కానీ ఇందులో ఒకటి మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కాగా మరొకటి యావరేజ్ గా నిలిచింది. మిగతా సినిమాలన్నీ సోసో గానే ఆడాయి. టైగర్ ష్రాఫ్, అక్కినేని అఖిల్, నాగ చైతన్య, రామ్ పొతినేని , శింబు, జయం రవి తదితర స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఈ అమ్మడికి కమర్షియల్ హిట్ పడడం లేదు. అలాగనీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లోనూ ఈ బ్యూటీ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇటీవల ఈ హీరోయిన్ పేరు తెగ మార్మోగుతోంది. దీనికి కారణం ఆమె సినిమాలు. ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. దీంతో భారీ హిట్ కోసం ఈ అమ్మడు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ బ్యూటీ కష్టపడిన తీరును చూసి స్వయంగా ఆ స్టార్ హీరోనే ప్రశంసలు కురిపించారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ బ్యూటీ మరెవరో కాదు హరి హర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్.
ఆదివారం (ఆగస్టు 17) నిధి అగర్వాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిధికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆమె నటిస్తోన్న ది రాజాసాబ్ మూవీ నుంచి నిధికి సంబంధించి ఒక కొత్త పోస్టర్ కూడా రిలీజైంది. అయితే నిధి పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే.. నిధి అగర్వాల్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. ఈ బ్యూటీ అమ్మమ్మది బేగం బజార్ లోని మార్వాడి ఫ్యామిలీ. అయితే తండ్రి ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బెంగళూరులో పెరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్ లోనూ నివసించింది. ఈ కారణంగానే నిధి మాతృభాష హిందీ అయినప్పటికీ తెలుగు, కన్నడ, తమిళ్ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.
Team #TheRajaSaab celebrates the gorgeous and talented @AgerwalNidhhi on her special day ❤️🔥❤️🔥
Her role is set to bring grace, warmth and depth to this KING SIZE tale 💥💥#HBDNidhhiAgerwal #Prabhas @DirectorMaruthi @MusicThaman @peoplemediafcy pic.twitter.com/AMVTgAVPEq
— The RajaSaab (@rajasaabmovie) August 17, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటోంది నిధి అగర్వాల్. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, రిద్ది కుమార్ కూడా హీరోయిన్లు గా నటిస్తున్నారు.
Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) August 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.