చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించి తెలుగు, హిందీ చిత్రసీమలో పనిచేసింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆమె కెరీర్ వివాదాలతోనే కొనసాగింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్ చిత్రం మక్డీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ సరసన కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కొత్త బంగారులోకం సినిమా తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ.. ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. ఈ అమ్మడు నటించిన చిత్రాలు సైతం డిజాస్టర్స్ కావడంతో అవకాశాలు దూరమయ్యాయి. శ్వేత కేవలం నటనే కాదు, రచయిత్రి, డాక్యుమెంటరీ డైరెక్టర్, నిర్మాత కూడా.
1991 జనవరి 11న జంషెడ్‌పూర్‌లో జన్మించిన శ్వేత చిన్నతనంలోనే ముంబైకి వచ్చింది. 2014లో హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పట్టుబడిన శ్వేత పేరు వివాదంలోకి వచ్చింది. ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకున్న పోలీసులు.. కొన్ని నెలల తర్వాత శ్వేతకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చారు. 2018లో, శ్వేత ఒక వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకుంది, కానీ 9 నెలల్లో విడాకులు తీసుకుంది.
17 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన శ్వేత.. వివాదాలను ఎదుర్కొని 23 ఏళ్లకే విడాకులు తీసుకుంది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న శ్వేత.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.