Genelia Deshmukh: సినిమాలు లేకపోయినా సంపాదన ఏమాత్రం తగ్గట్లే.. హాసిని ఆస్తులు తెలిస్తే మీ గుండె గుభేల్

|

Dec 17, 2024 | 9:16 AM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెనిలియా.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Genelia Deshmukh: సినిమాలు లేకపోయినా సంపాదన ఏమాత్రం తగ్గట్లే.. హాసిని ఆస్తులు తెలిస్తే మీ గుండె గుభేల్
Genelia
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నా అల్లుడు, బొమ్మరిల్లు, సాంబ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ పరిశ్రమలలో అనేక చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సరైన బ్రేక్ రాలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బీటౌన్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న జెనీలియా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నివేదికల ప్రకారం జెనీలియా ఆస్తులు 6 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.50 కోట్లకు పైగానే. అయితే చాలా సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. సంపాదన మాత్రం తగ్గట్లేదు. జెనీలియా ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఇక తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ ఆస్తులతో కలిపితే 22 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది.

బాంద్రాలోని అపోస్టోలిక్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన జెనీలియా.. సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేసింది. ఆమె తండ్రి నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉన్నత పదవిలో ఉన్నారు. 2003లో బాయ్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో “జానే తూ… యా జానే నా”, “ఫోర్స్” వంటి హిట్‌లతో గుర్తింపు పొందింది. తెలుగులోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది జెనీలియా. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి పూర్ణ భవనంలో నివసిస్తుంది. అలాగే ఆమె వద్ద బెంట్లీ కాంటినెంటల్, టెస్లా మోడల్ X వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. జెనీలియా, రితేశ్ 2012 ఫిబ్రవరి 3న మరాఠీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జెనీలియా, రితేష్‌లకు ‘ముంబయి ఫిల్మీ కంపెనీ’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. వారిద్దరికీ ప్లాంట్ బెస్ట్ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ పేరు ‘ఇమాజిన్ మీట్స్’.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.