AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్ 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి.. అయినా దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ప్రభాస్ సరసన.. !

సాధారణంగా కొందరు హీరోయిన్లకు కొన్ని సినిమాలు ప్లాప్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ దాదాపు 11 ఏళ్లుగా ఓ హీరోయిన్ మాత్రం ఒక్క హిట్ కూడా అందుకోలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ హీరోయిన్ నటించిన 9 సినిమాలు ఎక్కువగా ప్లాప్ అయ్యాయి. అయినా ఒక్కో సినిమాకు దాదాపు రూ.11 కోట్లు

Tollywood: ఈ హీరోయిన్ 9 సినిమాలు ప్లాప్ అయ్యాయి.. అయినా దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. ప్రభాస్ సరసన.. !
Heroine
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2024 | 5:30 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ పారితోషికం తీసుకునే స్టార్స్ ఉన్నారు. ఒక్క సినిమాతోనే నెట్టింట క్రేజ్ సొంతం చేసుకుని.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంటారు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంటారు. ఇక ఇటీవల కొందరు స్టార్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో టాప్ హీరోలను సైతం డామినేట్ చేస్తున్నారు. సాధారణంగా కొందరు హీరోయిన్లకు కొన్ని సినిమాలు ప్లాప్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ దాదాపు 11 ఏళ్లుగా ఓ హీరోయిన్ మాత్రం ఒక్క హిట్ కూడా అందుకోలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఈ హీరోయిన్ నటించిన 9 సినిమాలు ఎక్కువగా ప్లాప్ అయ్యాయి. అయినా ఒక్కో సినిమాకు దాదాపు రూ.11 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

అంతేకాదు.. ఆమె డైట్ కోసం కూడా నెలకు లక్షలు ఖర్చు చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే టాలీవుడ్ తార తాప్సీ పన్నూ. 1987 ఆగస్ట్ 1న ఢిల్లీలో జన్మించిన తాప్సీ.. మాతా జై కౌర్ పబ్లిక్ స్కూల్, అశోక్ విహార్, గురు తేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హరినగర్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోక అడుగుపెట్టింది. మోడలింగ్ రోజుల్లో, తాప్సీ రిలయన్స్ ట్రెండ్స్, రెడ్ ఎఫ్ఎమ్ 93.5, యూనిస్టైల్ ఇమేజ్, కోకా-కోలా, మోటరోలా, పాంటలూన్, పివిఆర్ సినిమాస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి బ్రాండ్‌లకు ప్రచారం చేసింది.

మంచు మనోజ్ సరసన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా తర్వాత వీర, మొగుడు, గుండెల్లో గోదారి, షాడో చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీలోనూ కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయ్యింది తాప్సీ.

డేవిడ్ ధావన్ హాస్య చిత్రం ‘చష్మే బద్దూర్’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి ప్రతికూల సమీక్షలు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో జుడ్వా 2, డంకీ, బేబీ, పింక్, బద్లా తదితర చిత్రాల్లో నటించింది. తాప్సీ తన 11 ఏళ్ల బాలీవుడ్ కెరీర్‌లో మొత్తం 9 సినిమాల్లో నటించింది. కానీ సోలో హీరోయిన్‌గా ఆమెకు ఒక్క హిట్ కూడా రాలేదు. అయినా ఆమెకు అవకాశాలకు కొదవలేదు. షారుక్‌ ఖాన్‌తో చేసిన ‘డంకీ’ కోసం తాప్సీ 11 కోట్లు తీసుకుంది. ప్రస్తుతం రూ.10 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తుంది. ఆమె కార్ల విలువ రూ.46 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవలే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లి చేసుకుంది. అలాగే తన డైట్ కోసం నెలకు లక్ష రూపాయాలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us