Shah Rukh Khan: అమ్మ బాబోయ్.. ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపద.. బాద్ షా ఎన్ని కోట్ల ఆస్తులంటే..

|

Aug 30, 2024 | 9:19 AM

కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకోస్తున్న బాద్ షాకు ఈ గతేడాది కలిసోచ్చింది. పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు మంచి వసూళ్లు రాబట్టాయి. భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్. అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగుల ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు.

Shah Rukh Khan: అమ్మ బాబోయ్.. ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపద.. బాద్ షా ఎన్ని కోట్ల ఆస్తులంటే..
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను మెప్పించాడు. తన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో నెట్టుకోస్తున్న బాద్ షాకు ఈ గతేడాది కలిసోచ్చింది. పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు మంచి వసూళ్లు రాబట్టాయి. భారతీయ సినీ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాడు షారుఖ్. అలాగే ఇప్పుడు భారతీయ సినీ రంగుల ప్రపంచంలో అత్యధిక ధనిక నటుడిగా నిలిచాడు.

మొట్టమొదటిసారిగా, షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లోకి ప్రవేశించి, దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా తన హోదాను పటిష్టం చేసుకున్నారు. రూ. 7300 కోట్ల సంపదతో “కింగ్ ఆఫ్ బాలీవుడ్”గా నిలిచాడు. 2023లో షారుఖ్ ఖాన్ నికర విలువ రూ.6300 కోట్లు. ఇప్పుడు ఏకంగా రూ.7300 కోట్లకు చేరింది. షారుఖ్ కేవలం సినిమాల నుంచి కాకుండా ఇతర రంగాల నుంచి కూడా సంపాదిస్తున్నాడు. ే

ఇవి కూడా చదవండి

ఏడాదిలోనే పెరిగిన షారుఖ్ సంపదకు కారణం అతని తెలివైన వ్యాపార వెంచర్లే. కోల్‌కతా నైట్ రైడర్స్, IPL ఛాంపియన్‌ల యాజమాన్యం, అలాగే నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అతడి సంపద పెరగడంలో కీలకపాత్ర పోషించాయి. హురున్ జాబితాలో అత్యధిక ధనిక సెలబ్రెటీగా షారుఖ్ నిలిచాడు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న నటుడు. ట్విట్టర్ ఖాతాలో 44.1 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. షారుఖ్ తర్వాత హీరోయిన్ జూహీ చావ్లా రూ.4600 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. హృతిక్ రోషన్ (రూ. 2,000 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 1,600 కోట్లు) కరణ్‌లతో సహా రిచ్ లిస్ట్‌లోని అనేక ఇతర బాలీవుడ్ దిగ్గజాలను షారుఖ్ అధిగమించాడు. 2024లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే ఫోర్బ్స్ టాప్ 10 నటులలో షారూఖ్ ఖాన్ ఒకరు. ఒక్క సినిమాకు రూ.150 కోట్లకు పైగా వసూలు చేస్తాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.