
పృథ్వీరాజ్ సుకుమారన్.. మలయాళీ చిత్రపరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో. విభిన్నమైన సినిమా కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల నుంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వరకు ప్రతి జానర్ సినిమాలతో అలరించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆడు జీవితం సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇటీవలే ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి దర్శకుడిగానూ పనిచేశారు. ఓవైపు వరుస వివాదాల మధ్య థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతుంది ఈ సినిమా. ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ పృథ్వీరాజ్ సుకుమారన్ సంపాదన వివరాలు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పృథ్వీరాజ్ ఆస్తులు, సంపాదన గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
నివేదికల ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తులు రూ.54 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. అలాగే అతడు కళ్యాణ్ సిల్క్స్ వంటి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి కూడా డబ్బు సంపాదిస్తాడు. ఆస్ట్రేలియాలో చదువుతున్నప్పుడు, ఒక యాదృచ్ఛిక ఆడిషన్ ద్వారా నందనం (2002)లో ఆయన అరంగేట్రం చేశారు. నక్షత్రక్కన్నుల్లా రాజకుమారన్ అవనుండోరు రాజకుమారి (2002), స్టాప్ వయోలెన్స్ (2002) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళం, తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. 2012లో పృథ్వీరాజ్ రాణి ముఖర్జీ సరసన ‘అయ్యా’ సినిమాలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 2019లో, సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ తో పృథ్వీరాజ్ స్టైలిష్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.
నివేదికల ప్రకారం, పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళలోని కొచ్చిలో ఒక రాజభవనం లాంటి ఇంటిని కలిగి ఉన్నాడు. ముంబైలోని పాలి హిల్ పరిసరాల్లోని రుస్తోంజీ పరిశ్రమ్‌లో అతనికి డ్యూప్లెక్స్ కూడా ఉంది. దీని విలువ రూ.30.6 కోట్లు. పృథ్వీరాజ్ సుకుమారన్ వద్ద మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 (రూ.3.60 కోట్ల నుండి ప్రారంభం), లంబోర్గిని ఉరుస్ (రూ.4.18 కోట్ల నుండి ప్రారంభం), రేంజ్ రోవర్ వోగ్ (రూ.2.40 కోట్ల నుండి ప్రారంభం), ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 (రూ.1.10 కోట్ల నుండి ప్రారంభం) వంటి హై-ఎండ్ కార్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :