Tollywood: తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, అంతలోనే బ్రేకప్.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ గత్తరలేపుతోందిగా..

|

Jul 28, 2024 | 11:00 AM

తెలుగు, మలయాళం, తమిళం భాషలలో ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే కెరీర్ మంచి పిక్స్ లో ఉండగానే ఈ హీరోయిన్ గురించి అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఈ నటి తన కంటే 5 సంవత్సరాలు చిన్నవాడైన సింగర్ తో ప్రేమలో పడిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి.

Tollywood: తనకంటే ఐదేళ్లు చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, అంతలోనే బ్రేకప్.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ గత్తరలేపుతోందిగా..
Actress
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో మోడ్రన్ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా జెరేమియా కోలీవుడ్ నటి. తెలుగు, మలయాళం, తమిళం భాషలలో ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే కెరీర్ మంచి పిక్స్ లో ఉండగానే ఈ హీరోయిన్ గురించి అనేక వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఈ నటి తన కంటే 5 సంవత్సరాలు చిన్నవాడైన సింగర్ తో ప్రేమలో పడిందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. కానీ తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడ స్పందించలేదు. కానీ వీరిద్దరి ప్రైవేట్ ఫోటోస్ అప్పట్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెను దుమారం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్తలతో బ్రేకప్ జరిగిందని.. ప్రస్తుతం ఇద్దరు తమ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ లవ్, బ్రేకప్ ఎవరితో తెలుసా..? కోలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో. ఇప్పుడు వీరిద్దరూ పర్సనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారు.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆండ్రియా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అలనాటి అందాల తార ఇప్పుడు గ్లామర్ డాల్. ఈ రోజుల్లో నటి చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. నెట్టింట ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారునెటిజన్లు. సౌత్ సినిమాలో యాక్టివ్ గా ఉన్న ఈ యువ నటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

ఇవి కూడా చదవండి

ఈ అందమైన ఆండ్రియా జెరెమియా తమిళంలో సినిమాలు చేస్తూ పాటలు పాడుతోంది. ప్రస్తుతం ఈబ్యూటీ వయసు 38 ఏళ్లు. ఆండ్రియా కంటే అనిరుధ్ ఐదేళ్లు చిన్నవాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ చాలా డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అనిరుధ్ ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఆండ్రియా ప్రముఖ నటి. అయితే వారి మధ్య ఇంత క్లోజ్ రిలేషన్ ఉందని అప్పుడు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. కానీ ఇద్దరి ఫోటోలు లీక్ అవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట నిజమైన ప్రేమేనా అని అడిగిన ప్రశ్నకు అనిరుధ్ బదులిస్తూ, ప్రేమ అంటే కాదు, అప్పుడు నాకు 19 ఏళ్లు, ఆమె వయస్సు కేవలం 25 ఏళ్లు అని చెప్పాడు. బ్రేకప్‌కి కారణం ఏమిటని అనిరుధ్‌ని ప్రశ్నించగా..ఏజ్ గ్యాప్ కారణంగా తమ బంధం విడిపోయిందని చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి