Srikanth-Uha: శ్రీకాంత్.. ఊహా అందమైన ప్రేమకథ గురించి తెలుసా ?..

|

Nov 23, 2022 | 8:37 AM

తను - ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. గతంలో తను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ

Srikanth-Uha: శ్రీకాంత్.. ఊహా అందమైన ప్రేమకథ గురించి తెలుసా ?..
Srikanth Uha
Follow us on

గత కొద్ది రోజులుగా హీరో శ్రీకాంత్..ఊహ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయాయని.. త్వరలోనే వీరు విడిపోతున్నారంటూ నెట్టింట రూమర్స్ స్ర్పెడ్ అయ్యాయి. ఈ వార్తలపై సీరియస్ అయ్యారు హీరో శ్రీకాంత్. తమ విడాకులపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా అరుణాచలం వెళ్లిన శ్రీకాంత్.. అక్కడి నుంచే ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. తను – ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. గతంలో తను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారని అన్నారు. ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీకాంత్. మంగళవారం సతీసమేతంగా అరుణాచలం వెళ్లిన శ్రీకాంత్.. అక్కడి నుంచే ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు. అయితే వీరిద్దరి విడాకుల న్యూస్ నెట్టింట హల్చల్ చేయడంతో.. శ్రీకాంత్…ఊహ ప్రేమకథ మరోసారి తెరపైకి వచ్చింది.

వీరిద్దరిది ప్రేమ వివాహమని అందరికి తెలిసిన విషయమే. వారి లవ్ స్టోరీ గురించి శ్రీకాంత్ గతంలో అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆమె సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి 4 సినిమాల్లో నటించారు. అప్పట్లో వారి మధ్య వాళ్లు ప్రేమించుకుంటున్నారని చాలా మందికి తెలియదు. ఊహకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో ఓరోజు మద్రాస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ ఊహ వాళ్ల ఇంటికి వెళ్లి తామిద్దరం ప్రేమించుకుంటున్నట్లు చెప్పారట. అయితే ముందు ఊహ కుటుంబసభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత శ్రీకాంత్‏తో ముందు నుంచి ఉన్న పరిచయం నేపథ్యంలో వారికి శ్రీకాంత్ గురించి ఓ అవగాగన ఉండడంతో పెళ్లికి ఒప్పుకున్నారట. 1997లో శ్రీకాంత్.. ఊహ వివాహం జరిగింది.

ఇవి కూడా చదవండి

ఈఏడాదితో వీరి పెళ్ళి జరిగి 25 సంవత్సరాలు పూర్తైంది. వివాహం తర్వాత ఊహా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వీరికి రోషన్, మేధ, రోహన్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోషన్ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యారు. ఇటీవల పెళ్లి సందడి సినిమాతో హిట్ అందుకున్నారు. అయితే ఈ 25 ఏళ్లలో శ్రీకాంత్.. ఊహా మధ్య విబేధాలు ఉన్నాయంటూ ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఆకస్మాత్తుగా కొద్దిరోజులుగా వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.