Kiran Abbavaram: ‘నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేక మధ్యలోనే వచ్చేశాం’: కిరణ్ అబ్బవరం

|

Mar 14, 2025 | 11:09 AM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా సినిమా శుక్రవారం (మార్చి 14)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కిరణ్ అబ్బవరం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Kiran Abbavaram: నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేక మధ్యలోనే వచ్చేశాం: కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram
Follow us on

గతేడాది క సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. దీని తర్వాత అతను నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ దిల్ రుబా. విశ్వ కరుణ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రెండు రాష్ట్రాల్లో శుక్రవారం దిల్ రుబా సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. కాగా దిల్ రూబా సినిమా రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ తన భార్య రహస్య గోరఖ్ తో కలిసి మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. అయితే మూవీలో ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్‌ వరకు ఉండలేకపోయాం. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం మాత్రమే ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.

 

ఇవి కూడా చదవండి

కాగా మలయాళంలో తెరకెక్కిన మార్కో సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో మోతాదకు మించి హింస ఉండడంతో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం మార్కో సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇక దిల్ రుబా సినిమా విషయానికి వస్తే.. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్‌పై విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ ఈ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు న‌జియా, స‌త్య, జాన్ విజ‌య్‌, న‌రైన్‌, క‌థి దేవిస‌న్‌, క్రాంతి త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సి.ఎస్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి.

 

భార్యతో కిరణ్ అబ్బవరం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.