Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం ఫిక్స్.. రొమాంటిక్ వీడియోతో రివీల్ చేసిన కాబోయే భార్య

|

Jul 15, 2024 | 11:08 AM

సినిమాల సంగతి పక్కన పెడితే.. సోమవారం (జులై 15) కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా.. కిరణ్ కు కాబోయే భార్య, ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ కూడా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది.

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం పెళ్లి ముహూర్తం ఫిక్స్.. రొమాంటిక్ వీడియోతో రివీల్ చేసిన కాబోయే భార్య
Kiran Abbavaram
Follow us on

 

టాలీవుడ్‌లోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. సక్సెస్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను ‘క’ అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోమవారం (జులై 15) కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా.. కిరణ్ కు కాబోయే భార్య, ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్ కూడా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. పనిల పనిగా తమ పెళ్లి డేట్ ను కూడా రివీల్ చేసింది. ఇందులో కిరణ్ ను భర్త అని పిలిచేందుకు ఆగలేకపోతున్నానని, దానికి ఇంకా 38 రోజులే టైమ్ ఉందని రాసుకొచ్చింది. అంటేఈ రాజావారు రాణివారు ఆగస్టు 22న మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారన్నమాట.

ఇవి కూడా చదవండి

కిరణ్- రహస్య గోరఖ్ ల రొమాంటిక్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కిరణ్ అబ్బవరంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో కాబోయే దంపతులకు ముందస్తుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ‘రాజావారు రాణీవారు’ సినిమాలో జంటగా నటించారు కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ ఈ విషయాన్ని ఇద్దరూ గోప్యంగా ఉంచారు. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారీ లవ్ బర్డ్స్. అంతేకాదు ఆ నెలలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. కాగా రహస్య గోరఖ్ తన తొలి సినిమా రాజావారు రాణీవారు తోనే కెరీర్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్నట్లు సమాచారం.

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల రొమాంటిక్ వీడియో ఇదిగో..

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.