సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. ప్రత్యేక వైద్యుల బృందం ఈ బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అలాగే పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను విడుదల చేస్తోంది. తాజాగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీ తేజ్ కు ఆక్సిజన్, మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం. రెండు రోజులుగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతోంది. అయితే ఐనో ట్రోపిక్ సపోర్ట్ అవసరం ఉంది. యాంటీ బయాటిక్స్ మారుస్తున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి జ్వరం లేదు. ట్యూబ్ ద్వారానే ఫీడింగ్ అందిస్తున్నాం. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. న్యూరాలజికల్ స్టేటస్ స్టేబుల్ గా ఉంది’ అని వైద్యులు చెప్పుకొచ్చారు. కాగా రేవతి ఫ్యామిలీకి పుష్ప 2 టీమ్ మొత్తం 2 కోట్ల ఆర్థి సాయం అందించింది. ఇటీవలే స్టార్ ప్రొడ్యసర్ దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలిసి ఈ ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే శ్రీతేజ్ చికిత్స కు సంబంధించి అన్ని రకాల ఖర్చులు చూసుకుంటోంది.
అంతకు ముందు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీ తేజ్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీదుగా రూ. 25 లక్షల సాయం పిల్లాడి ఫ్యామిలీకి అందించారు. ఇక అల్లు అరవింద్ కూడా పలు సార్లు కిమ్స్ ఆస్పత్రిక వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించారు. తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పారు.
Mythri Movie makers donates Rs 50 lakhs to the family of the Sandhya Theater victim family pic.twitter.com/FBQlngM65V
— Teju PRO (@Teju_PRO) December 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.