మీ దరిద్రపు ఫోటోషూట్ కోసం మా దేవుడే దొరికాడా..? నెటిజన్స్ దెబ్బకు బిత్తరపోయిన హాలీవుడ్ నటి

అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ఈవేడుక కోసం ఇండియాకు వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కర్దాషియాన్.. తన ఫొటోలు, వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు పెద్ద దుమారాన్నే రేపాయి.

మీ దరిద్రపు ఫోటోషూట్ కోసం మా దేవుడే దొరికాడా..? నెటిజన్స్ దెబ్బకు బిత్తరపోయిన హాలీవుడ్ నటి
Kim Kardashian
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2024 | 4:33 PM

అంబానీ ఇంట పెళ్ళికి దేశవిదేశాలనుంచి అతిధులు వచ్చారు. ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రెటీల నుంచి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పెళ్ళివేడుకకు హాజరయ్యారు. అలాగే అమెరికన్ పాప్ సింగర్స్ కూడా హాజరయ్యారు. అదేవిధంగా అమెరికన్ నటి కిమ్ కర్దాషియాన్ కూడా ఈవేడుక కోసం ఇండియాకు వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కిమ్ కర్దాషియాన్.. తన ఫొటోలు, వీడియోలను తెగ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు పెద్ద దుమారాన్నే రేపాయి. నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు.

ఇది కూడా చదవండి : దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

రీసెంట్ గా వినాయకుడి విగ్రహంపై చేయి వేసి ఫోటోషూట్ చేసింది కిమ్ కర్దాషియాన్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలను కిమ్ కర్దాషియాన్ దెబ్బతీశారని ఆరోపించారు. తర్వాత ఆ ఫోటోను ఆమె డిలీట్ చేసింది. ఇంతకు ముందు కూడా చాలా మంది విదేశీ సెలబ్రిటీలు ఇలాంటి తప్పు చేశారు. హిందువులు పూజించే దేవుళ్ల ఫోటోలు, విగ్రహాలు కొంతమంది బయటి వ్యక్తులకు కేవలం అలంకార వస్తువులుగా కనిపిస్తాయి. దాంతో వాటితో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు కిమ్ కర్దాషియాన్ కూడా అదే తప్పు చేసింది.

ఇది కూడా చదవండి :Sai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమట..

అమెరికా నుంచి కిమ్ కర్దాషియాన్ ముంబైకి వచ్చింది. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి కిమ్ అతిథిగా హాజరయ్యింది. ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించినప్పటికీ చాలా హాట్ గా కనిపించింది. హాట్ గా కనిపిస్తూనే గణేశుడి విగ్రహం మీద చేతులు పెట్టి ఫోటోకి పోజులిచ్చింది. అభ్యంతరకర రీతిలో పోజులిచ్చిన కిమ్ కర్దాషియాన్ ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే అది చూసిన చాలా మంది షాక్ అయ్యారు. నటి ఇలా చేయడం సరికాదని పలువురు కామెంట్స్ చేశారు. ‘మీ దరిద్రపు ఫోటో షూట్‌కి హిందూ దేవుడిని ఉపయోగించకండి’ అని కొందరు క్లాస్ తీసుకున్నారు. తరువాత, కిమ్ తన తప్పును తెలుసుకుంది. దాంతో గణేశ విగ్రహంతో ఉన్న ఫొటోను డిలీట్ చేసింది. అయినప్పటికీ ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంది.

కిమ్ కర్దాషియాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు