
సీనియర్ హీరోయిన్ సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె.. ఆ తర్వాత సహయనటిగా మెప్పించారు. ప్రస్తుతం సీని పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆమె.. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కర్ణాటక లోక్ సభ ఎంపీగా ఉన్న సుమలత.. ఇటీవల తన కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం ఘనంగా చేశారు. కర్ణాటకలోని ఒక ప్యాలస్ లో జరిగిన పెళ్లికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ఎంపీ రఘురామరాజు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కేజీఎఫ్ స్టార్ యశ్, మంచు మనోజ్ దంపతులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వేడుకలో యశ్, మరో స్టార్ హీరో దర్శన్ పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజ్ పీ డాన్స్ చేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. అలాగే యశ్ తన సతీమణి రాధిక.. నటి సుమలతో కలిసి స్టెప్పులేసి వావ్ అనిపించారు. ఇక ఇదే పార్టీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, జాకీ ష్రాఫ్ తదితరులు హజరయ్యారు.
కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ తర్వాత ఇప్పటివరకు యశ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇటీవల వినిపిస్తోన్న సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ చిత్రంలో యశ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.
#YashBOSS Dance with New Couple, Sumakka and #Darshan Sir ♥️#Yash #Yash19 @TheNameIsYash pic.twitter.com/gQQu6L3JoG
— Only Yash™ (@TeamOnlyYash) June 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.