Srinidhi Shetty: కేజీఎఫ్ బ్యూటీకీ టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరో సరనస శ్రీనిధి ?..

|

Jan 29, 2023 | 3:35 PM

ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న శ్రీనిధి..ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసింది. దీంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా విక్రమ్ నటించి కోబ్రా చిత్రంలో కనిపించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Srinidhi Shetty: కేజీఎఫ్ బ్యూటీకీ టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరో సరనస శ్రీనిధి ?..
Srinidhi Shetty
Follow us on

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్లో వచ్చిన కేజీఎఫ్ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు వీరిద్దరు. ఇక ఇటీవల వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో అదే స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ 2 చిత్రంలో యశ్ సరసన కథానాయికగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న శ్రీనిధి..ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసింది. దీంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా విక్రమ్ నటించి కోబ్రా చిత్రంలో కనిపించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత శ్రీనిధి నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయనుందట. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం కేజీఎఫ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రీనిధి.. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్న వెంకీ.. ఇప్పుడు సైంధవ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ’ ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో భారీ అంచనాలను నెలకొల్పింది. సైంధవ్ భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.