Keerthy Suresh: అన్నాత్తేకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న కీర్తి సురేష్..! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
మహానటి సినిమాతో మెప్పించిన నటి కీర్తి సురేష్ వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అన్నాత్తే చిత్రంలో కీర్తి సురేష్ నటించారు. ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది...

మహానటి సినిమాతో మెప్పించిన నటి కీర్తి సురేష్ వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అన్నాత్తే చిత్రంలో కీర్తి సురేష్ నటించారు. ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.50 లక్షలో, కోటి రూపాయలో కాదు ఏకంగా రూ.2 కోట్లు తీసుకుందని సమాచారం. కీర్తి సురేష్ 2019లో మహానటి చిత్రానికి ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. అన్నత్తే సినిమాలో కీర్తి సురేష్ రజనీకాంత్‌కు సోదరిగా నటించారు. ఈ సినిమా కథ ఆమె చుట్టూ తిరుగుతుంది.
అన్నాత్తే చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ పంచుకున్న కీర్తి మరో అరుదైన మైలురాయిని సాధించింది. ఆమె తల్లి మేనక 1981 తమిళ చిత్రం ‘నెత్రిక్కన్’లో సూపర్ స్టార్‌తో స్క్రీన్ పంచుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో సూపర్‌స్టార్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయానని కీర్తి సురేష్ చెప్పారు. రజనీకాంత్‌తో పాటు అన్నాత్తేలో కీర్తి నటనను విమర్శకులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం రజనీకాంత్ అన్నాత్తేలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కీర్తి సురేష్ రూ. 2 కోట్లు అందుకున్నారు. ఒక సినిమాకు ఆమె అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనని తెలుస్తుంది.
180 కోట్లతో రూపొందిన అన్నాత్తే దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా సినిమాను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తున్నారు. ఈ చిత్రం తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో పెద్దన్నగా తీసుకొచ్చారు.
ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ఒక ట్వీట్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ గురించి సమాచారం ఇచ్చారు. బుధవారం వరకు ఈ చిత్రం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ.196.08 కోట్లు వసూలు చేసిందని ట్వీట్ చేశారు. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్లు రాబట్టిన సినిమాల జాబితాలో చోటు దక్కించుకునే దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది. కీర్తి సురేష్ తెలుగు చిత్రం భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటిస్తుంది.
#Annaatthe WW Box Office
INCHES closer to ₹200 cr mark
Day 1 – ₹ 70.19 cr Day 2 – ₹ 42.63 cr Day 3 – ₹ 33.71 cr Day 4 – ₹ 28.20 cr Day 5 – ₹ 11.85 cr Day 6 – ₹ 9.50 cr Total – ₹ 196.08 cr#Rajinikanth #KeerthySuresh #Nayanthara
— Manobala Vijayabalan (@ManobalaV) November 10, 2021
Read Also.. TigerHills Production No1: టైగర్ హిల్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్.. లైవ్ వీడియో