నెక్ట్స్ మూవీ గురించి కత్రినా హింట్
కోవిడ్ వ్యాప్తి ప్రమాదకరంగా విస్తరించడంతో గత కొద్ది నెలలుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే రికవరీల రేటు పెరగడం, డెత్ రేటు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే ప్రజల సాధారాణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.

కోవిడ్ వ్యాప్తి ప్రమాదకరంగా విస్తరించడంతో గత కొద్ది నెలలుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే రికవరీల రేటు పెరగడం, డెత్ రేటు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే ప్రజల సాధారాణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా సినిమా, సీరియల్ షూటింగ్స్‌కు కూడా అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకోసం కొన్ని మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. దీంతో జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణల్లో పాల్గొనేందుకు తారలు రెడీ అవుతున్నారు. కొందరు బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా మరో అందాల తార షూటింగ్ షురూ చేసేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ భామ కత్రినా తన కొత్త చిత్రానికి సంబంధించి ఓ పోస్ట్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టింది.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం స్క్రిప్ట్ స్టిల్‌ను ఇన్ స్గాలో షేర్ చేసింది. కత్రినాకైఫ్ ఇన్ స్టాలో ఇచ్చిన అప్ డేట్‌తో ఆమె ఫాలోవర్లు తెగ సంతోషపడుతున్నారు. త్వరలోనే తమ అభిమాన హీరోయిన్‌ను తెరపైకి చూడొచ్చని ఆశపడుతున్నారు. కత్రినాకైఫ్ ఈ మూవీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
Also Read :
ఏపీ : ఆ 4 జిల్లాల్లో లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన సర్కార్
