పేకాట ఆడుతోన్న ఈ స్టార్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా..?

కైత్రినా కైఫ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అమ్మడి స్టెప్పులకు బాక్సాఫీస్ షేకవుతుంది. ఇక ఐటమ్ సాంగ్స్‌కి ఈమె కేరాఫ్ అడ్రస్.  సోషల్ మీడియాలో కూడా కత్రినా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. తమ పర్సనల్, ప్రొఫిషనల్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ..విరామ సమయంలో తన సిబ్బందితో పేకాట ఆడుతూ చిల్ అయ్యింది. పెళ్లి బట్టలు, ఒంటి నిండా ఆభరణాలతో ఉన్న ఆమె లుక్ చూసిన […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:39 pm, Fri, 24 January 20
పేకాట ఆడుతోన్న ఈ స్టార్ హీరోయిన్‌ని గుర్తు పట్టారా..?

కైత్రినా కైఫ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్. అమ్మడి స్టెప్పులకు బాక్సాఫీస్ షేకవుతుంది. ఇక ఐటమ్ సాంగ్స్‌కి ఈమె కేరాఫ్ అడ్రస్.  సోషల్ మీడియాలో కూడా కత్రినా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. తమ పర్సనల్, ప్రొఫిషనల్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్న ఈ హాట్ బ్యూటీ..విరామ సమయంలో తన సిబ్బందితో పేకాట ఆడుతూ చిల్ అయ్యింది. పెళ్లి బట్టలు, ఒంటి నిండా ఆభరణాలతో ఉన్న ఆమె లుక్ చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. పిక్‌లో  కత్రినాతో పాటు ఆమె స్టైలిస్ట్ అనిత ష్రాఫ్, హెయిర్‌స్టైలిస్ట్ యియాని, మేకప్ ఆర్టిస్ట్ డేనియల్ ఉన్నారు. ప్రజంట్ ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. కాగా ప్రస్తుతం కత్రినా కైఫ్ కిలాడీ హీరో అక్షయ్ కుమార్ సరసన ‘సూర్యవంశీ’ చిత్రంలో నటిస్తోంది. మార్చి 27 న ఈ మూవీ రిలీజ్ కానుంది.