AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా పేరు సీత.. కానీ ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. వీడియో రిలీజ్ చేసిన కార్తీక దీపం సుమిత్ర

కార్తీక దీపం సీరియల్ నటి సుమిత్ర అలియాస్ సీతా లక్ష్మి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది.

నా పేరు సీత.. కానీ ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. వీడియో రిలీజ్ చేసిన కార్తీక దీపం సుమిత్ర
Karthika Deepam Sumitra
Basha Shek
|

Updated on: Apr 28, 2026 | 4:01 PM

Share

సీతా లక్ష్మీ.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ కార్తీక దీపం సుమిత్ర అంటే ఇట్టే గుర్తు పడతారు. అందులో దీప తల్లిగా ఆమె అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పువచ్చు. ఈ సీరియల్ లో చాలా భాగం ఏడుస్తూనే కనిపిస్తుంటుంది సుమిత్ర. అయితే రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తనకు కష్టాలు ఉన్నాయంటోంది సీత. ఇదిలా ఉంటే ఈ నటి ఈ మధ్యన పలు మార్లు బుర్ఖాలో కనిపించింది. అలాగే బొట్టు పెట్టుకోదు. నమాజ్ కూడా చేస్తుండటం చూసి చాలా మంది ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సందేహాలు, అనుమానాలన్నింటీకి తెరదించింది సీత. నెటిజన్లు కొద్ది రోజులుగా అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘చాలా రోజులుగా ఈ ఇష్యూ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. నా ఫాలోవర్స్‌కి నా మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా కామెంట్స్‌లో అడుగుతూనే ఉన్నారు. ఆ టైమ్‌లో తప్పదు కాబట్టి.. వన్ వర్డ్ ఆన్సర్‌లా చెప్తుంటాం. అయితే అలా చెప్పడం వల్ల తప్పుగా సమాచారం వెళుతోంది. సీతా లక్ష్మీ అనే పేరు ఉంది కదా.. పేరులో సీత ఉంది కదా.. బొట్టు ఉంటే బావుంటుంది కదా.. మీరు బుర్కా ఎందుకు ధరిస్తానని కూడా అడుగుతుంటారు. ఇది కావాలనే వేసుకుందని.. నటిస్తుందని అంటుంటారు. నా విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. నా పేరు సీతా లక్ష్మీ. అది మా అమ్మ నాన్నలు నాకు పెట్టిన పేరు. నా ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్‌లో కూడా సీతా లక్ష్మీ అనే ఉంటుంది. చాలా మంది లాగే నా లైఫ్‌లో కూడా ఒక బ్యాడ్ మెమరీ ఉంది. 2013 తరువాత దాదాపు నాలుగేళ్లు నేను యాక్టింగ్ కు దూరమయ్యాను. నాకు విడాకులు అయ్యాయి. ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్.. నిజం చెప్పడానికి నేను బాధపడను. దాపరికాలేం లేవు. ఈ కాలంలో ఇవన్నీ సహజమే కానీ.. అనుభవిస్తేనే కానీ ఆ బాధ అర్థం కాదు.

‘ విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ కలిశాడు. నా బాధలు అతనితో చెప్పుకున్నప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. మనకీ ఓ తోడు కావాలి కదా అని అతన్ని పెళ్లి చేసుకున్నాను. నా భర్త పేరు అబ్దుల్ ఖాదర్. నాకు మా ఇంటి తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. కాబట్టి మా అత్తగారి ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ కావాలంటే కొన్ని విషయాలు నేను చేయకతప్పదు. అందుకే నేను కొన్ని పరిస్థితుల్లో వాళ్ల మతంలోకి మారాల్సి వచ్చింది. మా అత్తగారు ని నాకు యాస్మిన్ అని పేరు పెట్టారు. అలా సీతాలక్ష్మి.. యాస్మిన్ అయ్యింది. వాళ్లు నన్ను యాస్మిన్ అనే పిలుస్తారు. యాస్మిన్ అని పేరు మార్చుకున్న తరువాత.. యాక్టర్ యాస్మిన్ అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే నాకు సీతగానే గుర్తింపు ఉంది. అందుకే ఇండస్ట్రీలో సీత అనే పేరుతోనే కొనసాగుతున్నా’ అని చెప్పుకొచ్చింది సీత ఆయాస్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కార్తీక దీపం సుమిత్ర రిలీజ్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!
హోటల్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే లైట్లు ఆన్ చేస్తున్నారా..!
హోటల్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే లైట్లు ఆన్ చేస్తున్నారా..!