కూర్చొన్న కొమ్మనే నరుక్కోవద్దు.. రష్మిక పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే వరుస విజయాలను అందుకుంది. పుష్ప 2 సినిమాతో పాటు బాలీవుడ్ లో చావా సినిమాతో మరో హిట్ అందుకుంది. వరుస విజయాలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. ఇటీవల రష్మిక మందన్న పై ఓ ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు

ఈ మధ్యకాలంలో రష్మిక మందన్న గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరుస విషయాలతో దూసుకుపోతున్న రష్మిక పై కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఎమ్మెల్యే రవికుమార్ గనిగ ఇటీవల రష్మిక పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలి అంటూ పెద్ద దుమారం రేపాడు. రష్మికను ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే కర్ణాటక ఎక్కడ ఉందని అడిగిందని, ఆమెకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రష్మిక బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు అంగీకరించలేదని అన్నారు. ఆమెకి కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె గౌరవం ఇవ్వడం లేదు. రష్మికాకు తగిన గుణపాఠం చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ ఎన్నోసార్లు రష్మికాను సంప్రదించాం. కానీ ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు. నాకు కర్ణాటకు వచ్చే సమయం లేదు.. నా ఇల్లు హైదరాబాద్ లో ఉంది అని అంటుంది. అంతే కాదు కర్ణాటక ఎక్కడో కూడా నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది అని ఆయన అన్నారు. కాగా రష్మిక మందన్నకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కోడల జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్‌లకు లేఖ రాశారు.
తాజాగా ఎమ్మెల్యే రవికుమార్ గనిగ వివరణ ఇచ్చారు. తాను రష్మికాను అనలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మికను వ్యక్తిగతంగా విమర్మించాలన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. కానీ ఆమెకు గుణపాఠం చెప్పాలని నేను అన్నాను.. దాని అర్ధం ఆమెకు జీవిత పాఠాలు నేర్పాలని తప్ప.. ఆమెపై వ్యక్తిగతంగా దాడి చేయడం అని కాదు. ఆమెను మీరు కూర్చొన్న కొమ్మనే నరుక్కోవద్దు అని నేను అన్నాను. మా రాష్ట్ర కార్యక్రమానికి రష్మికను ఆహ్వానిస్తే ఆమె రాలేదు. ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగారు. ఆ రాష్ట్రానికి మద్దతుగా నిలబడండి అని అన్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. మా రాష్ట్రం, మా భూమి, మా కన్నడ భాషను కచ్చితంగా గౌరవించాల్సిందే.. అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.