AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Upendra: హీరో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చిన హైకోర్ట్..

బెంగళూరులోని చెన్నమ్మ కేరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో ఉపేంద్రపై ఫిర్యాదు నమోదైంది. అయితే తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఆపాలని డిమాండ్ చేస్తూ ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని ఉపేంద్ర తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా వాదించారు.

Actor Upendra: హీరో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చిన హైకోర్ట్..
Actor Upendra
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2023 | 6:40 PM

Share

హీరో ఉపేంద్ర.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం నెలకొంది. ఇటీవల తన రాజకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆయన దళితులని అవమానించేలా కామెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. తాజాగా ఈ ఎఫ్ఐఆర్ పై స్టే ఇచ్చింది కర్ణాటక హైకోర్ట్.

బెంగళూరులోని చెన్నమ్మ కేరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో ఉపేంద్రపై ఫిర్యాదు నమోదైంది. అయితే తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఆపాలని డిమాండ్ చేస్తూ ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని ఉపేంద్ర తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హోల్లా వాదించారు.

ఇవి కూడా చదవండి

హైకోర్టు స్టే పై స్పందించిన ఉపేంద్ర…

View this post on Instagram

A post shared by Upendra (@nimmaupendra)

రీసెంట్ గా ఉపేంద్ర సోషల్ మీడియాలో లైవ్ లో వచ్చి ప్రజాకూటమి గురించి మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన ఓ సామెత చెప్పారు. విమర్శకులను ఓ వర్గంతో పోల్చుతూ..”ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారని.. అలాగే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు కచ్చితంగా ఉంటారని.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజలపై ప్రేమాభిమానాలే నిజమైన దేశభక్తి” అన్నారు. దీంతో ఉపేంద్ర మాటలపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే తన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు ఉపేంద్ర.

ఉపేంద్ర ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Upendra (@nimmaupendra)

ఉపేంద్ర ఇంటికి భద్రత.. ఉపేంద్ర కామెంట్స్ పై కొందరు విమర్శలు గుప్పించారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపేంద్ర ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపేంద్ ఇంటికి పోలీసులు గట్టి భద్రత కల్పించారు. బెంగళూరులోని కత్తారిగుప్పె, సదాశివ నగర్‌లోని తన నివాసానికి ఉపేంద్ర గైర్హాజరైనట్లు సమాచారం. అయితే ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉపేంద్ర ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Upendra (@nimmaupendra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.