
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్న కన్నడ చిత్రం కాంతారకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ వరాహరూపం యూట్యూబ్‌తోపాటు .. అన్ని ఫ్లాట్ ఫారమ్స్ నుంచి తొలగించారు. అంతేకాదు.. ఈ పాటను ఆడియో ప్లాట్ ఫారమ్ నుంచి కూడా తీసివేశారు. వరాహరూపం సాంగ్ కాంతార చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. థియేటర్లలోనే కాదు.. నెట్టింట విడుదలైన కాసేపటికే అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ సాంగ్ మ్యూజిక్ కాపీ చేసిందంటూ కేరళకు చెందిన మ్యూజిక్ బ్రాండ్ తుక్కుడం బ్రిడ్జ్ ఆరోపించింది. ఐదేళ్ల క్రితం తమ బ్రాండ్ రూపొందించిన నవరసం సాంగ్ మ్యూజిక్ మాదిరిగానే వరాహారూపం సాంగ్ ఉందంటూ.. కాపీ రైట్స్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.
అక్టోబర్ 24న తుక్కుడం బ్రిడ్జ్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. తమ అనుమతి లేకుండా సాంగ్ ప్లే చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించగా.. థియేర్లలో వరాహరూపం సాంగ్ ప్లే చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది కేరళలోని కోయిక్కోడ్ కోర్టు. అలాగే ఈ పాటను అనుమతి లేకుండా ‘నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, యూట్యూబ్ తదితర ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించరాదని ఆదేశించింది.
ఇక ఇప్పుడు ఈ పాటను ‘హోంబాలే ఫిల్మ్స్’ యూట్యూబ్ ఛానెల్ నుండి డెలిట్ చేశారు. మ్యూజిక్ యాప్ జియో సావన్‌లో కూడా ఈ పాట అందుబాటులో లేదు. ఈ పాట యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు, ‘సావ్న్..’ వంటి మ్యూజిక్ యాప్‌ల నుండి తొలగించబడింది. యూట్యూబ్ మ్యూజిక్‌తో సహా కొన్ని యాప్‌లలో ‘వరాహ రూపం..’ పాట ఇంకా కొన్ని ప్రైవేట్ ఛానల్లలో మాత్రమే ఈసాంగ్ వినడానికి ఛాన్స్ ఉంది.
Varaha Roopam Song
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.