Rukmini Vasanth: తిరుమలలో ‘కాంతారా 2’ హీరోయిన్.. రుక్మిణీ వసంత్‌కు ఇంత అందమైన చెల్లెలు ఉందా? వీడియో

సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్. దీని తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆడలేదు. అయితే రిషభ్ శెట్టి నటించిన కాంతారా 2 సినిమాలో రుక్కూ యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.

Rukmini Vasanth: తిరుమలలో కాంతారా 2 హీరోయిన్.. రుక్మిణీ వసంత్‌కు ఇంత అందమైన చెల్లెలు ఉందా? వీడియో
Rukmini Vasanth

Updated on: Mar 06, 2026 | 5:54 PM

‘కాంతార 2’ ఫేమ్, కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం (మార్చి 06) ఉదయం తిరుమలకు విచ్చేసిన ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంది. అనంతరం స్వామి వారిని దర్శించుకుంది. రుక్కూ వెంట ఆమె చెల్లెలు యశోద కూడా ఉంది. ఇద్దరూ కలిసి సంప్రదాయబద్ధంగా చాలా సింపుల్‌ లుక్‌లో కనిపించారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన రుక్మిణీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు తెలుగులో సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది రుక్మిణి. మూవీస్ అప్ డేట్స్ ఏంటి? అని ఒకరు అడగ్గా.. ‘ఇప్పుడేం లేదు. త్వరలో వస్తుంది, అప్పుడు చెబుతా’ అని తెలుగులో చెప్పుకొచ్చింది రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రుక్కూకు ఇంత అందమైన చెల్లెలు ఉందా? అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది రుక్మిణీ వసంత్. ఆ తర్వాత భగీరా, భైరతిరణగల్, ఏస్, మదరాసి, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తదితర సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే రిషభ్ శెట్టితో చేసిన కాంతార 2 ఈ కన్నడ బ్యూటీకి ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇందులో రుక్కూ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రుక్మిణీ నటించిన ‘టాక్సిక్’.. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) లోనూ రుక్మిణీనే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

రుక్మిణీ వసంత్ తెలుగులో ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో చూశారా? వీడియో

 

చెల్లెలితో రుక్మిణీ సవంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us