Kannappa Movie: కన్నప్ప సినిమా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్ ల రెమ్యునరేషన్ ఎంతంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా ఈ రోజు (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందునుంచే ఈ సినిమాలోని అతిథి పాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజోల్ ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ మూవీలో వివిధ పాత్రల్లో తళుక్కుమన్నారు. మరి ఈ స్టార్ నటులు కన్నప్ప సినిమాలో నటించినందుకు ఎన్ని కోట్లు అందుకున్నారో తెలుసా?

Kannappa Movie: కన్నప్ప సినిమా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్, కాజల్ ల రెమ్యునరేషన్ ఎంతంటే?
Kannappa Movie

Edited By: TV9 Telugu

Updated on: Jun 27, 2025 | 1:00 PM

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎంతో మంది ఈ సినిమాలో నటించారు.
మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మించారు. సుమారు రూ. 300 కోట్లతో ఈ మూవీని నిర్మించినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కన్నప్ప సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇందులో నటించిన స్టార్స్ ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో తెలుసుకుందాం రండి.

 

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలి తెలుగు చిత్రం ‘కన్నప్ప’. గతంలో ఆయన స్వయంగా చెప్పినట్లుగా, అక్షయ్ కుమార్ ఎటువంటి కారణం చేతనైనా పారితోషికం తీసుకోకుండా పని చేయడు. ఈ చిత్రంలో నటించినందుకు అక్షయ్ కుమార్ భారీ మొత్తంలోరెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. శివుడి పాత్రలో నటించినందుకు గానూ అతను ఆరు కోట్ల రూపాయలు అందుకున్నాడని తెలుస్తోంది. నటుడు మోహన్ లాల్ కూడా ఒక రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమాలో నటించినందుకు మోహన్ లాల్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఉచితంగా నటించారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన నటులలో ఒకరైన ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా రోజులు పని చేశారు. ఇక సినిమాలో అతని స్క్రీన్ టైమ్ 30 నిమిషాలకు పైగా ఉన్నప్పటికీ ఎటువంటి పారితోషికం తీసుకోలేదీ పాన్ ఇండియా సూపర్ స్టార్.

ఇవి కూడా చదవండి

వీరితో పాటు కాజోల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు. వీరు ఒక్కొక్కరు కోటి రూపాయల జీతం అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం భారీగానే డబ్బులు ఖర్చుపెట్టినట్లు సమాచారం. సుమారు రూ. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .