యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో సలార్ సినిమా ఒకటి. సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ మూవీపై ఇప్పటికే పలు అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ బజ్ ప్రకారం ఈ మూవీలో మరో పాన్ ఇండియా స్టార్ నటిస్తున్నాడట..
అతను మరెవరో కాదు.. కన్నడ రాక్ స్టార్ యశ్. సలార్ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో సలార్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న సలార్ మూవీ ఏ రెంజ్ లో ఉండబోతుందో అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట సందడి షూరు చేశారు. ఇటీవలే యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కలెక్షన్ల విషయంలో రికార్డ్ సృష్టించింది కేజీఎఫ్ మూవీ. ఈ సినిమా పాన్ ఇండియాన్ సీఓవోగా క్రేజ్ సంపాందించుకున్నాడు యశ్. ఇప్పుడు ప్రభాస్, యశ్ ఒకే సినిమాలో కనిపించనుండడంతో సలార్ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.