Actor : హీరోగా జాతీయ అవార్డ్.. ఇప్పుడు రోజూ కూలీగా.. కష్టాల కడలిలో పాపులర్ నటుడు..

సినిమా అనే రంగుల ప్రపంచంలో నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించడం చెప్పడం కష్టమే. వెండితెరపై అద్భుతమైన నటనతో అలరించిన తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతుంటారు. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న హీరోలు అనుహ్యంగా సినిమాలకు దూరమై ఊహించని విధంగా లైఫ్ లీడ్ చేస్తుంటారు.

Actor : హీరోగా జాతీయ అవార్డ్.. ఇప్పుడు రోజూ కూలీగా.. కష్టాల కడలిలో పాపులర్ నటుడు..
Actor (4)

Updated on: Dec 09, 2025 | 4:42 PM

ఒకప్పుడు వెండితెరపై అలరించిన నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సహజ నటనతో .. విభిన్న కంటెంట్ చిత్రాలతో అలరించిన తారలు.. ఇప్పుడు నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో రోజూ కూలీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పుడు హీరోగా అలరించిన నటుడు.. ఇప్పుడు రోజూ కూలీగా పనిచేయడం చూసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? కన్నడ హీరో అభిషేక్ హెచ్. ఎన్. కన్నడ చిత్రపరిశ్రమలో హీరోగా తనదైన ముద్ర వేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

ఇవి కూడా చదవండి

రామ్ రెడ్డి అనే యువకుడు తిథి సినిమాతో కన్నడ సినీరంగంలోకి దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమా కథాంశం జనాలను తెగ ఆకట్టుకుంది. ఇందులో అభిషేక్ హెచ్.ఎన్ హీరోగా నటించారు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు చేయాల్సిన కర్మ (తిథి) చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటీ.. ? అతడి మూడు తరాల వారసులు ఏం చేస్తున్నారనేది సినిమా కథ. తొలి చిత్రంతోనే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రానికి కర్ణాటక రాష్ట్ర అవార్డులతోపాటు పలు పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డ్ సైతం వచ్చింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఈ సినిమా తర్వాత తర్లె విలేజ, హల్లి పంచాయితీ అనే సినిమాలను తెరకెక్కించాడు. ఇందులో హీరోగా నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ సినిమా తర్వాత అతడు నటించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో అతడికి అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమా అవకాశాలు సైతం తగ్గిపోవడంతో ఇప్పుడు అతడు కూలీగా మారినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి చూసి జనాలు షాకవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..