Kamal Haasan: కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాల్సిందే.. లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా బ్యాన్ ?..
ప్రస్తుతం థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కమల్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా మండిపడుతున్నారు.

కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ ఇటీవల కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కర్ణాటకలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్ లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ చేసిన కామెంట్స్ ఇవి. దీంతో ఆయన తీరుపై కర్ణాటక ప్రజలు, సినీప్రముఖులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని.. లేదంటే ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేస్తామని అన్నారు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నరసింహులు. ఈ విషయంపై కమల్ హాసన్ ను సంప్రదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించకూడదనే చర్చ సైతం తెరపైకి వచ్చిందని అన్నారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నరసింహులు టీవీ9 కన్నడతో మాట్లాడుతూ.. “కమల్ హాసన్ ను సంప్రదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఇప్పటికే తమిళ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిని సంప్రదించాము. ఈ విషయానికి ఈరోజు మెయిల్ సైతం పంపిస్తాము. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. కమల్ హాసన్ క్షమాపణ చెప్పేవరకు ఈ విషయాన్ని వదిలిపెట్టము. కమల్ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈనెల 30 వరకు కమల్ క్షమాపణ చెప్పకపోతే చిత్రవిడుదలను అడ్డుకుంటాము. ఎన్నో సంస్థలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై మేము సమావేశమై కమల్ తప్పుగా మాట్లాడరనే అభిప్రాయానికి వచ్చాం. ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే” అని అన్నారు.
భాషా వివాదం తలెత్తినప్పుడు కన్నడిగులందరూ ఏకమవ్వాల్సిందేనని.. అది మన కర్తవ్యం అని అన్నారు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సంస్థ మాజీ అధ్యక్షురాలు నటి జయమాల. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో శింబు, శివరాజ్ కుమార్, త్రిష, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కమల్, అభిరామి మధ్య ముద్దు సీన్ ఉండడంపై సైతం ఈ సినిమా టీంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 5న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..
