AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్.. ప్రియురాలి కోసం హత్య చేయించిన నటుడు

దర్శన్‌తో పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేశాయి. ఇదిలా ఉంటే పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని తెలుస్తోంది. ఈ విషయం పవిత్ర దర్శన్ కు తెలిపింది. దాంతో ఆ వ్యక్తి హతమార్చడానికి దర్శన్ ప్లాన్ చేశాడు.

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్.. ప్రియురాలి కోసం హత్య చేయించిన నటుడు
Darshan
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2024 | 11:35 AM

Share

కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. ఓ హత్య కేసులో నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి  పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని కొందరు హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ హత్య పెద్ద దుమారాన్నే రేపింది. ఈ హత్యకు కారణమైన  నటుడు దర్శన్‌ని మైసూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు అరెస్టు  చేశారు.

దర్శన్‌తో పవిత్ర గౌడ సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేశాయి. ఇదిలా ఉంటే పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని తెలుస్తోంది. ఈ విషయం పవిత్ర దర్శన్ కు తెలిపింది. దాంతో ఆ వ్యక్తి హతమార్చడానికి దర్శన్ ప్లాన్ చేశాడు. బెంగుళూరులోని కామాక్షిపాలయలో రేణుకాస్వామి హత్య చేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి ఓ షెడ్డులో ఉంచారు. ఆతర్వాత అతడిని విచ్చలవిడిగా కొట్టారని తెలుస్తోంది.  రేణుకా స్వామిపై దాడి చేసిన వారిలో దర్శన్ ఉన్నట్లు సమాచారం. ఆతర్వాత అతడిని హత్య చేశారు. మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు. దర్శన్‌ను విజయనగరం ఏసీపీ చందన్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే దర్శన్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో చిక్కుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు