Kangana Ranaut : బాగోతాన్ని బయటపెడతా.. శిల్పాశెట్టి భర్త అరెస్ట్ పై కంగనా సంచలన కామెంట్లు

Raj Kundra arrested: బాలీవుడ్‌‌‌‌లో కలకలం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్‌‌‌‌కుంద్రా చీకటి వ్యవహారాలు తవ్వినకొద్దీ బయటకు వస్తున్నాయి. అశ్లీల చిత్రాలను నిర్మించడం..

Kangana Ranaut : బాగోతాన్ని బయటపెడతా.. శిల్పాశెట్టి భర్త అరెస్ట్ పై కంగనా సంచలన కామెంట్లు
Kangana

Updated on: Jul 23, 2021 | 2:59 PM

Raj Kundra arrested: బాలీవుడ్‌‌‌‌లో కలకలం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్‌‌‌‌కుంద్రా చీకటి వ్యవహారాలు తవ్వినకొద్దీ బయటకు వస్తోన్నాయి. అశ్లీల చిత్రాలను నిర్మించడం వాటిని పలు యాప్‌‌‌‌లలో అప్లోడ్ చేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే యువతులను బలవంతంగా ఈ ఊబిలోకి దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత ఫిబ్రవరి 4నే ఈ అశ్లీల వీడియో రాకెట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. జులై 19న పోలీసులు రాజ్ కుంద్రాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ లో రాజ్ కుంద్రా ప్రధాన సూత్రదారి అని పోలీసులు తేల్చారు. ఇందుకుసంబంధించి తమవద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రాజ్ కుంద్రా అరెస్ట్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ స్పందించారు.

కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీ పై నిప్పులు చెరిగింది. తాజాగా కంగనా నటిస్తున్న తలైవి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కంగనా .. బాలీవుడ్ ను గట్టర్ తో పోల్చింది. అంతే కాదు అక్కడంతా కంపూ..చెత్తే ఉందని విమర్శించింది. ‘బాలీవుడ్ కాదు బులీవుడ్’ అంటూ విరుచుపడింది. తాను నటిస్తున్న ‘టీకు వెడ్స్ షేరు’ సినిమాలో బాలీవుడ్ బాగోతాన్ని బయటపెడతానని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్యూట్ స్మైల్‌‌‌‌తో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

Raj Kundra Custody: శిల్పాశెట్టి భర్త వీడియో మేకింగ్ ఒప్పందం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క వీడియోకు ఎంత చెల్లించేవారంటే..

Allu Arjun: ప్రొడ్యూసర్‏గా షూటింగ్ సెట్‏లోకి అల్లు బాబీ.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్..