AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: సెన్సార్ పూర్తిచేసుకున్న విక్రమ్ సినిమా.. కమల్ మూవీ రన్ టైమ్ ఎంతంటే..

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ విక్రమ్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఈ విషయన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు..

Vikram: సెన్సార్ పూర్తిచేసుకున్న విక్రమ్ సినిమా.. కమల్ మూవీ రన్ టైమ్ ఎంతంటే..
Kamal Haasan
Rajitha Chanti
|

Updated on: May 26, 2022 | 7:53 AM

Share

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విక్రమ్ (Vikram). అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్‏తోపాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీలో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య కీలకపాత్రలో నటిస్తుండడంతో.. విక్రమ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజ్ కమల్ ఫీలింస్ ఇంటర్నేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిని మా పాన్ ఇండియా లెవల్లో జూన్ 3న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ విక్రమ్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఈ విషయన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.. కీలకమైన సెన్సార్ ప్రక్రియ సైతం పూర్తికావడంతో విక్రమ్ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసే పనిలో పడ్డారు మేకర్స్. అలాగే ఈ సినిమా దాదాపు మూడు గంటలు.. అంటే 173 నిమిషాల రన్ టైమ్ ఉండనున్నట్లుగా సమాచారం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీంతం ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!