Kamal Haasan: రజినీకాంత్‏తో విభేధాలు ఉన్నా… షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..

. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకు రాజకీయ. వృత్తిపరమైన విభేధాలు ఉన్నప్పటికీ తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నారు.

Kamal Haasan: రజినీకాంత్‏తో విభేధాలు ఉన్నా... షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..
Kamal Rajini
Follow us
Rajitha Chanti

|

Updated on: May 26, 2022 | 8:58 AM

రాజకీయాలు వేరు..స్నేహం వేరని.. ఈ రెండింటికీ చాలా దూరం ఉందన్నారు యూనివర్సెల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan). 25 ఏళ్ల సంవత్సరాల స్నేహంలో ఎలా ఉండాలనేది తాము నిర్ణయించుకున్నామన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకు రాజకీయ. వృత్తిపరమైన విభేధాలు ఉన్నప్పటికీ తమ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నారు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విక్రమ్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గోన్న కమల్.. రజినీ కాంత్ తో తనకున్న స్నేహం గురించి.. విభేధాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. “రజినీకాంత్ ట్రైలర్ లాంచ్ కు రాలేకపోయారు.. కానీ ఈ సినిమా గురించి నన్ను విష్ చేశారు.. అలాగే కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణాన్ని చెప్పారు.. నాకు ఉదయనిధి స్టాలిన్ కు మంచి అనుబంధం ఉంది.. ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ మూవీస్ నా విక్రమ్ సినిమాను తమిళనాడులో పంపిణీ చేస్తుంది.. ఉదయనిధి స్టాలిన్ నా అభిమాని.. కనీసం ఏడాదిలో నేను ఒక సినిమా అయినా చేయాలని స్టాలిన్ కోరుకుంటుంటాడు.. ఎప్పుడూ సాధారణ వ్యక్తిలాగే స్టాలిన్ కనిపిస్తారు ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే రజినీకాంత్.. తనకు మధ్య రాజకీయ విభేధాలు ఉన్నప్పటికీ .. స్నేహాన్ని కొనసాగించడంలో ఏలాంటి ఇబ్బంది లేదన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్, డీఎంకేకు వ్యతిరేకంగా కమల్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా.. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించారు. రాజ్ కమల్ ఫీలింస్ ఇంటర్నేషన్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.