Kamal Haasan : తమిళ్ బిగ్ బాస్ పై వైరల్ అవుతున్న వార్తలు.. కమల్ హోస్ట్ గా చేయడం లేదంటూ గుసగుసలు.

కొద్ది రోజులుగా తమిళ బిగ్‌ బాస్‌కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాలిటిక్స్‌తో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న కమల్‌.

Kamal Haasan : తమిళ్ బిగ్ బాస్ పై వైరల్ అవుతున్న వార్తలు.. కమల్ హోస్ట్ గా చేయడం లేదంటూ గుసగుసలు.

Updated on: Jun 12, 2021 | 10:51 PM

కొద్ది రోజులుగా తమిళ బిగ్‌ బాస్‌కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాలిటిక్స్‌తో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్న కమల్‌.. నెక్ట్స్ సీజన్‌ హోస్ట్ చేయకపోవచ్చన్నది మేజర్‌గా వినిపించిన మాట. అంతేకాదు కమల్ ప్లేస్‌లో శింబును కూడా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్‌కు చెక్‌ పెట్టే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. బిగ్ బాస్‌ షోకు కమిట్ అయిన సమయంలోనే కమల్ 5 సీజన్లకు ఒకేసారి అగ్రిమెంట్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు సీజన్‌న్లు కంప్లీట్ అయ్యాయి.. సో అగ్రిమెంట్ ప్రకారం కమల్ తప్పని సరిగా మరో సీజన్‌ హోస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎంత బిజీగా ఉన్నా కమల్ సీజన్ 5 హోస్ట్ చేయక తప్పదన్న మాట.

కమల్ కూడా బిగ్ బాస్‌ను పక్కన పెట్టే ఆలోచనలో లేరన్న టాకే వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన షో కావటం.. తమిళ్‌లో కూడా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ అన్న పేరు రావటంతో నెక్ట్స్ సీజన్‌ హోస్ట్ చేసేందుకు కమల్ కూడా రెడీగానే ఉన్నారు. సో ఈ అప్‌డేట్‌తో తమిళ బిగ్ బాస్‌పై వినిపిస్తున్న రూమర్స్‌ కు చెక్ పడినట్టే అంటున్నారు టీవీ ఆడియన్స్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

PSPK28: పవర్ స్టార్ సినిమాలో మలయాళ కుట్టీ.. పవన్- హరీష్ శంకర్ ప్రాజెక్ట్ లో ఆ హీరోయిన్

Ram Charan: తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్ కు పండగే..

Kambalapally kathalu : చాప్టర్ 2 కు సిద్దమవుతున్న కంబాలపల్లి కథలు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు..