
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది నటి కల్పిక గణేష్. ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. హీరోకు సిస్టర్ గా, ఫ్రెండ్ గా, అక్కగా, వదినగా ఇలా పలు సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకుంది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అదే సమయంలో పలు వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ కమెడియన్ పై సంచలన ఆరోపణలు చేసిందీ అందాల తార. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ అందాల తార తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.
మొన్నామధ్య పబ్ లో గొడవ చేసింది కల్పిక గణేష్.. బర్త్ డే కేక్ విషయమై పబ్ సిబ్బంది, నటికి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. చివరకు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నటి పై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయింది కల్పిక గణేష్. అయితే పబ్ సిబ్బంది దాడి చేయడంపై సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పబ్ తీరును ఎండగడుతూ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా మరోసారి హంగామా చేసింది కల్పిక.. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌లో హంగామా సృష్టించింది కల్పిక. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చి, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా కల్పిక ప్రవర్తించిందని తెలుస్తుంది. ఒక్కసారిగా వచ్చి మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కల్పిక పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి