Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ అమ్మ పాత్రలకు సై అన్నారా.. అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. గౌతమ్ కోచ్లు ను వివాహమాడిన తర్వాత కాజల్ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. అయితే పెళ్లితర్వాత ఈ అమ్మడికి కాస్త ఆఫర్లు తగ్గాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ సీనియర్ హీరోల సరసన చేసేందుకు ఓకే చెప్తుంది. ఇప్పటికే మెగాస్టార్ కు జోడీగా ఆచార్య సినిమా చేస్తుంది. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తుంది ఈ భామ. మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణుకు అక్కగా నటించిన కాజల్ ఇప్పుడు అమ్మ పాత్రకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాజల్ తమిళంలో ‘రౌడీ బేబీ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె ఓ అమ్మాయికి తల్లిగా నటించనుందట కాజల్.
అలాగే, ఇందులో కాజల్ సాదాసీదాగా డీ-గ్లామరైజ్డ్ గా కనిపిస్తుందని అంటున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనున్నారు. పెళ్లి అయిన తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆమె కాస్త జాగ్రత్తలుతీసుకుంటుంది కాజల్. గ్లామర్ పాత్రలకు నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఉమా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :