Kajal Aggarwal: యాక్సిడెంట్‌లో హీరోయిన్ కాజల్‌కు తీవ్ర గాయాలు! ‘దేవుని దయ’తో అంటూ పోస్ట్ షేర్ చేసిన చందమామ

టాలీవుడ్ హీరోయిన్, చందమామ కాజల్ అగర్వాల్ కు యాక్సిడెంట్ అయ్యిందని, ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడిందని గత కొన్ని గంటలుగా రూమర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ కాజల్ అగర్వాలే స్వయంగా స్పందించింది.

Kajal Aggarwal: యాక్సిడెంట్‌లో హీరోయిన్ కాజల్‌కు తీవ్ర గాయాలు! దేవుని దయతో అంటూ పోస్ట్ షేర్ చేసిన చందమామ
Kajal Aggarwal

Updated on: Sep 08, 2025 | 11:34 PM

ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోలందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకుంది. అయితే పెళ్లి, పిల్లలయ్యాక కాస్త స్పీడ్ తగ్గించింది. అయితే భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ అభిమానులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమాలో పార్వతి దేవిగా అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో పెద్దగా కనిపించుకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్లు నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ పేరు మార్మోగిపోతోంది. ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని, ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని సామాజిక మాధ్యమాలు కోడై కూస్తున్నాయి. కొన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. చివరకు ఈ వార్తలు కాజల్ దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో ఆమె వెంటనే స్పందించింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా యాక్సిడెంట్ రూమర్లను కొట్టి పారేసింది.

“నాకు రోడ్డు ప్రమాదం జరిగిందని, ఇక నేను లేను అంటూ ఓ నిరాధార వార్త లు వచ్చినట్లు నాకు తెలిసింది. అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు. అది చూసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. ఆ దేవుడి దయ వల్ల నేను చాలా బాగున్నాను. సురక్షితంగా ఉన్నాను. అలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని నేను కోరుతున్నాను. లానే ఎవరికి స్ప్రెడ్ చేయవద్దని నేను దయతో ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వార్తల కంటే సానుకూలత, నిజాలపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ కాజల్’ అని హీరోయిన్ పోస్ట్ పెట్టింది. ఈ రూమర్లపై ఏకంగా కాజల్ క్లారిటీ ఇవ్వటంతో కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాజల్ అగర్వాల్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి