“ప్రభాస్ ను నేనే పరిచయం చెయ్యాలి…కానీ ఆ కారణం వల్ల కుదరలేదు”.. అసలు విషయం చెప్పిన దర్శకేంద్రుడు..

హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా.. హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా.. చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా.. అప్పట్లో రాఘవేంద్రరావే టాప్‌

ప్రభాస్ ను నేనే పరిచయం చెయ్యాలి...కానీ ఆ కారణం వల్ల కుదరలేదు.. అసలు విషయం చెప్పిన దర్శకేంద్రుడు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 15, 2021 | 2:22 AM

K. Raghavendra Rao : హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా.. హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా.. చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా.. అప్పట్లో రాఘవేంద్రరావే టాప్‌. అందుకే.. వెంకటేష్, మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి వాళ్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేసి.. స్టార్లు అయ్యేలా చేశాడు ఈ దర్శకేంద్రుడు. కాని రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయలేక పోయాడు. అయితే ప్రభాస్‌ తండ్రి రాఘవేంద్రరావుకు సన్నిహితుడు కావడంతో తన కొడుకుతో సినిమా చేయమని రాఘవేంద్ర రావుని అడిగారట. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ డైరెక్షన్లో తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు.

ఇక ఇదే విషయాన్నితాజాగా  ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. అప్పటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు రాఘవేంద్ర రావు. ‘ప్రభాస్‌ని నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా.. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు’ అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు . ఇక దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్‌ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

“తోపు యాక్టర్ అవుతానని అన్నారు..కానీ అట్టర్ ప్లాప్ అయ్యా”‌.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన జగ్గూభాయ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!