“తోపు యాక్టర్ అవుతానని అన్నారు..కానీ అట్టర్ ప్లాప్ అయ్యా”.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన జగ్గూభాయ్..
టాలీవుడు సీనియర్ నటుడు జగపతి బాబు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. శోభన్ బాబు తర్వాత ..
Jagapathi Babu : టాలీవుడు సీనియర్ నటుడు జగపతి బాబు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడుగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. శోభన్ బాబు తర్వాత కుటుంబ కథానేపధ్య కథలతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకుని టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అని అనిపించుకున్నాడు. అయితే జగపతి బాబు.. సినిమాల్లోకి వచ్చే ముందు ఎంత హైప్‌ని చూశాడో అంతే డౌన్ ఫాల్ని కూడా చూశాడు. తన కెరీర్ మొదట్లో ఎన్నో అగచాట్లు పడ్డాడో… అంతే పొగడ్తల్ని చవిచూశాడు. అలా ఎన్నో మాటలనోర్చి.. చివరికి లెజెండ్ స్థాయికి చేరాడు జగతిబాబు. అయితే జగపతి తన కెరీర్ మొదట్లో.. జరిగిన ఓ సంఘటనను టీవీ9తో షేర్ చేసుకున్నాడు… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అందరూ తనని తోపు యాక్టర్ అనుకున్నారిని.. మెగాస్టార్ చిరంజీవి కూడా.. తన షూటింగ్ మొదటి రోజు… పెద్ద హీరో ఇండస్ట్రీలోకి వస్తున్నాడనుకొన్నాడు. కాని తీరా చూస్తే.. తాను అట్టర్ ప్లాప్ అయ్యాయని.. దీంతో తాను చాలా అంబారస్‌గా ఫీల్ అయ్యానన్నాడు. తన వాయిస్ బాగాలేదన్నారని… తన ఫేస్ కంటే.. చాలా మెచ్యూర్గా వాయిస్ ఉందని ఇండస్ట్రీలో వాళ్లందరూ ఫీల్ అయ్యారని జగపతి చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Nani Movie : కలకత్తా వీధుల్లో నాని ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..