Nani Movie : కలకత్తా వీధుల్లో నాని ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..
నాచురల్ స్టార్ నాని.. టక్ జగదీష్ సినిమాలోని ఇంకోసారి పాటతో యూట్యూబ్‌లో సదండి మొదలెట్టాడో లేదో.. అప్పుడే ఇంకో సినిమా అప్ డేట్తో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు..

Nani Movie : నాచురల్ స్టార్ నాని.. టక్ జగదీష్ సినిమాలోని ఇంకోసారి పాటతో యూట్యూబ్‌లో సదండి మొదలెట్టాడో లేదో.. అప్పుడే ఇంకో సినిమా అప్ డేట్తో సోషల్ మీడియాలోకి వచ్చేశాడు. టక్ జగదీష్ తో పాటు.. రాహుల్ సంక్రీత్యన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటిస్తున్న నాని.. ఇప్పుడు కలకత్తాకి షిఫ్ట్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు కరోనాకు దొరకకుండా జాగ్రత్తగా హైదరాబాద్‌లోనే షూటింగ్ చేసుకున్న ఈ టీం.. ఇప్పుడో లాంగ్ అండ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ కోసం కలకత్తా వీధుల్లో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు సినిమా పూర్తై పోయినట్టే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాక్సీవాలా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్.. స్టోరీకి నాచురల్ స్టార్ నాని ఓకే చెప్పడంతో మొదలైన ఈ సినిమా బజ్ .. టైటల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో పీక్ స్టేజ్ లోకెళ్లింది. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని.. ఆ కారణంగానే నాని ఈ సినిమాలో భాగమయ్యాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్.బోయనపల్లి నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
పాన్ ఇండియా స్టార్ ప్లానింగ్ అంతా మార్చేశాడే.. డేట్స్ షిఫ్ట్ చేస్తున్న డార్లింగ్.. కారణం ఇదే..




