పాన్ ఇండియా స్టార్ ప్లానింగ్ అంతా మార్చేశాడే.. డేట్స్ షిఫ్ట్ చేస్తున్న డార్లింగ్.. కారణం ఇదే..

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి లా...తయారైంది..రెబల్ స్టార్ ప్రభాస్‌ పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో పాన్ ఇండియా సినిమాలకు డేట్లు ఇచ్చి కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న..

పాన్ ఇండియా స్టార్ ప్లానింగ్ అంతా మార్చేశాడే.. డేట్స్ షిఫ్ట్ చేస్తున్న డార్లింగ్.. కారణం ఇదే..
Rajeev Rayala

|

Feb 15, 2021 | 1:41 AM

Prabhas Movies: : అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి లా…తయారైంది..రెబల్ స్టార్ ప్రభాస్‌ పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో పాన్ ఇండియా సినిమాలకు డేట్లు ఇచ్చి కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న డార్లింగ్ ‌కు.. హాట్‌ గా ఆదిపురుష్ అగ్ని ప్రమాదం తగిలింది. అసలే పీరియాడికల్ సినిమా.. దానికోసం భారీ ఖర్చుతో భారీగా  సెట్టేశారు. కాని అది ఉన్నట్టుండి.. అగ్ని పాలు కావడంతో.. షూట్ మొదటికే మోసం వచ్చింది. ఒకవేళ సెట్టు మళ్లీ నిర్మించాలంటే.. చాలా టైం పడుతుంది. దానికితోడు.. ఫారెన్‌ ఎక్కుప్‌మెంట్స్‌ను వాడాల్సి ఉంటుంది. అవి  ఇంపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది.

సో.. ఇవన్నీ ఇప్పుడే కుదరవు కనుక.. ఇక ప్రభాస్‌ చేసేదేమి లేక ఆదిపురుష్ కు ఇచ్చిన డేట్లను.. సలార్‌కు, నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు షిఫ్ట్‌ చేశాడని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను ఆల్మోస్ట్ ముగించిన ప్రభాస్‌ ఆ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి ‌ 14న  రిలీజ్ చేసాడు. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. సాహో సినిమా నిరాశ పరిచిన చాలా రోజుల తర్వాత ప్రభాస్ టీజర్ చూసి అభిమానులంతా తెగ ఆనందపడిపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Prabhas: ‘మా పాజిటివ్ హీరోకే ఎందుకు ఈ కష్టాలు’.. తెగ వర్రీ అవుతున్న ప్రభాస్ అభిమానులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu