Simhadri: ‘సింహాద్రి’ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక థియేటర్లలో మాస్ జాతరే అంటోన్న విశ్వక్ సేన్..

|

Apr 10, 2023 | 7:44 AM

ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన దేశముదురు సినిమాకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు తారక్ వతంతు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రిని మళ్లీ విడుదల చేస్తున్నారు.

Simhadri: సింహాద్రి రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక థియేటర్లలో మాస్ జాతరే అంటోన్న విశ్వక్ సేన్..
Simhadri
Follow us on

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోస్ సినిమాలు ఇప్పుడు తారల పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ బర్త్ డే సందర్భంగా పలు సినిమాలను రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా ఆరెంజ్ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో నష్టాలను మిగిల్చిన ఈ చిత్రం రీరిలీజ్ చేయగా.. భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ డబ్బును నిర్మాత నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఇక బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైన దేశముదురు సినిమాకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు తారక్ వతంతు వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రిని మళ్లీ విడుదల చేస్తున్నారు.

తారక్ బర్త్ డే సందర్భంగా మే 20న 4కే క్వాలిటీతో సింహాద్రి సినిమాను అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారకంగా తెలుయజేస్తూ సింహాద్రి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్.. ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. హీరోయిజానికి అసలు సిసలు ఎలివేషన్ ఇచ్చిన సినిమా ఇది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ చిత్రాన్ని ఇప్పుడు 4కె క్వాలిటీతో వెండితెరపై ఎంజాయ్ చేయబోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో తారక్ వీరాభిమాని.. యంగ్ హీరో విశ్వక్ సేన్ సింహాద్రి విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ సందడి చేసిన సంగతి తెలిసిందే. తన అభిమాన హీరో సినిమా రీ రిలీజ్ చేయడంపై విశ్వక్ సపోర్ట్ చేస్తున్నారు. రీరిలీజ్ పోస్టర్ ట్వీట్ చేసి మాస్ జాతర కోసం వెయిటింగ్ అని రాసుకొచ్చారు. “వస్తున్నాడు.. మాస్ అమ్మ మొగుడు. తారక్ అన్న పుట్టినరోజునాడు సింహాద్రి 4కె రీరిలీజ్ అవుతోంది. థియేటర్లలో మాస్ జాతర కోసం వెయిటింగ్ ..జై ఎన్టీఆర్” అంటూ ట్వీట్ చేశారు విశ్వక్ సేన్. ఈ ట్వీట్ కు తారక్ అభిమానుల నుంచి రియాక్షన్ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.