Jr.NTR: ఎన్టీఆర్ ఫస్ట్ అభిమాని ఇతడే.. స్టేజ్ పైకి పిలిచి మరీ హగ్గిచ్చిన తారక్..
వార్ 2.. పాన్ ఇండియా లెవల్లో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన పాతికేళ్ల సినీప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన నటకు, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు. దాదాపు 25 ఏళ్లుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తారక్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బీటౌన్ లోకి అరంగేట్రం చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. పాతికేళ్ల సినీప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. “25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే వ్యక్తి నా వెనకే తిరిగాడు. ఎవరు మీరు అని అడిగితే నా పేరు ముజీప్, నేను మీ అభిమానిని బాబు అని చెప్పడంతో షాకయ్యాను.
ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అప్పుడే ఫ్యాన్ అని అడిగితే నేను మీతోనే ఉంటానని చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అతడు ఇప్పటికీ నాతోనే ఉన్నాడు” అని అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతుండగానే సదరు వ్యక్తి స్టేజ్ పైకి రావడంతో అతడిని ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు తారక్.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?








