AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: చివరి 40 నిమిషాలు అద్భుతమే.. ఆ ఒక్క ఫైట్ సీన్ హైలైట్.. ఎన్టీఆర్ కామెంట్స్..

ఈరోజు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. టికెట్స్ ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరడంపై ప్రశ్నించగా.. దైవ ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

Jr.NTR: చివరి 40 నిమిషాలు అద్భుతమే.. ఆ ఒక్క ఫైట్ సీన్ హైలైట్.. ఎన్టీఆర్ కామెంట్స్..
Jrntr
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2024 | 8:28 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాగా.. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాలం, తమిళం భాషలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఈరోజు ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. టికెట్స్ ప్రీ సేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరడంపై ప్రశ్నించగా.. దైవ ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

‘ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించాను. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు సోలోగా దేవర సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. కాస్త టెన్షన్ గా ఉంది. విడుదల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. అలాగే దేవర ట్రైలర్ ముంబాయిలో రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో ఉత్తరాది అడియన్స్ ప్రేమ చూసి ఆర్చర్యపోయాను. ఈ కొత్త సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక దేవర విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

సినిమా సినిమాకీ కొరటాల శివపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి. కమర్షియల్ చిత్రాలతో ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. దేవరలో భిన్నంగా ఉంటుంది. మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు. నీటి లోపల 38 రోజులు షూటింగ్ చేశాం. ఇది హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ’ అంటూ చెప్పుకొచ్చారు తారక్. ఈ మూవీ బీటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ , శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us