Jr NTR: కన్నడ ఫ్యాన్స్ ను కట్టిపడేసిన యంగ్ టైగర్.. వేదిక ఏదైనా అది తారకరాముడికే సొంతం

ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్. ఆ సినిమాలో కొమురం భీమ్ గా అద్భుతమైన నటన తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులనే కాదు..

Jr NTR: కన్నడ ఫ్యాన్స్ ను కట్టిపడేసిన యంగ్ టైగర్.. వేదిక ఏదైనా అది తారకరాముడికే సొంతం
Ntr
Follow us

|

Updated on: Nov 02, 2022 | 3:39 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా కంటిన్యూ అయిన తారక్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు తారక్. అంతే కాదు తన నటనకు ఎవ్వరు సాటి రారు అని ప్రతిసినిమాలో నిరూపించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్. ఆ సినిమాలో కొమురం భీమ్ గా అద్భుతమైన నటన తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను కట్టిపడేసారు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్ వచ్చింది. తారక్ నటనకు అక్కడి ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే తారక్ స్పీచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వేదిక ఏదైనా అక్కడ తారక్ మాట్లాడుతున్నారంటే చూపు తిప్పుకోలేం.

సందర్భానుసారం గా తారక్ తన స్పీచ్ తో అదరగుతుంటారు. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జపాన్ వెళ్లి ఎన్టీఆర్ అక్కడ జపనీస్ లో మాట్లాడి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ జపాన్ భాషలో మాట్లాడతంతో అక్కడి వారు ఫిదా అయ్యారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.ఈ కార్క్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు ఎన్టీఆర్ కూడా అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తారక్ కన్నడ భాషలో మాట్లాడు ఆకట్టుకున్నారు. అద్భుతంగా ఎక్కడా తడబడకుండా కన్నడలో మాట్లాడి  అక్కడున్న వారి చేత చప్పట్లు కొట్టించుకున్నారు యంగ్ టైగర్. పునీత్ నవ్వులో ఉండే స్వచ్చత మరెక్కడా చూడలేదు.. అహం అహంకారాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్. సూపర్ స్టార్ గా.. భర్తగా.. తండ్రిగా.. స్నేహితుడిగా తనదైన ముద్ర వేశారు అంటూ పునీత్ పై తన ప్రేమను కురిపించారు తారక్. దాంతో పునీత్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక పునీత్ కు తారక్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..