Devara Movie: విడుదలకు ముందే ‘దేవర’ సెన్సెషన్.. ప్రీ సేల్‏లో తారక్ క్రేజ్.. ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే..

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా దేవర చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా వెయిట్ చేస్తోన్న ఈ మూవీ ట్రైలర్

Devara Movie: విడుదలకు ముందే 'దేవర' సెన్సెషన్.. ప్రీ సేల్‏లో తారక్ క్రేజ్.. ఎన్ని టికెట్స్ అమ్ముడయ్యాయంటే..
Devara
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2024 | 3:47 PM

మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తుండగా.. ఫస్ట్ పార్ట్ ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ చేసింది చిత్రయూనిట్. మొన్నటి వరకు వరుస పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ పెంచేశారు మేకర్స్. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా దేవర చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆత్రుతగా వెయిట్ చేస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు తారక్ ప్రకటించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా దేవర సినిమా విడుదలకు ముందే సత్తా చాటింది. ఈ యాక్షన్ మూవీ ప్రీ సేల్ లో అత్యధిక టికెట్స్ అమ్ముడయినట్లు చిత్రయూనిట్ తెలిపింది. 5 లక్షల కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడయినట్లు టీమ్ వెల్లడించింది. దీంతో ఈసినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అలాగే దేవర ట్రైలర్ 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరోవైపు గతంలో విడుదలై టీజర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ తో మరోసారి యాక్షన్ విజువల్ ట్రీట్ ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఆ మూవీ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో దేవర చిత్రం కోసం యావత్ పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
ఆ హీరోతో లిప్ కిస్.. దెబ్బకు వాంతులు చేసుకున్న స్టార్ హీరోయిన్..
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తుందో తెలుసా?
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డు చెల్లింపు షురూ
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..