Nandamuri Mokshagnya: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పూర్తి పేరెంటో తెలుసా? తాతయ్య పేరు వచ్చేలా భలే ఉందిగా..
ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మోక్షు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ పుట్టిన రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 06)న బాలయ్య తనయుడి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడి మొదటి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మోక్షు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ పుట్టిన రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 06)న బాలయ్య తనయుడి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడి మొదటి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదే సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు బాలయ్య తనయుడు. నందమూరి అభిమానులు కూడా ఈ పోస్టర్ ను చూసి మోక్షు లుక్ అదిరిపోయిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరోయిన్, మూవీ జానర్, ఇతర టెక్నీషియన్ల గురించి త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోక్షజ్ఞకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో ఒక ఆసక్తికర విషయం బయటపెడింది. అదేంటంటే మోక్షజ్ఞ పూర్తి పేరు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన పోస్టులో ‘నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ’కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూర్తిపేరు రాసుకొచ్చాడు. దీంతో మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తాతయ్య, నాన్న పేర్లను నిలబెట్టేలా మోక్షు కూడా మంచి హీరోగా ఎదుగుతాడంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇదే సినిమాతో బాలయ్య రెండో కూతురు తేజస్విని కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తోండడం విశేషం.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్..
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗 Let’s do it 🤞
Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx
— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024
తాతయ్య పేరు నిలబెట్టాలి.. ఎన్టీఆర్ విషెస్..
Congratulations on your debut into the world of cinema! May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
— Jr NTR (@tarak9999) September 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.