AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి.. బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ ట్వీట్..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, కుటుంబ సభ్యులు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణ హెల్త్ గురించి ట్వీట్ చేశారు.

Jr NTR: బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి.. బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ ట్వీట్..
Kalyan Ram, Balakrsihna, Jrntr
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2026 | 4:18 PM

Share

నందమూరి బాలకృష్ణ తన కొత్త ప్రాజెక్టు #NBK111 చిత్ర షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయమైనట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రతినిధులు, నందమూరి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేశ్‌, నటులు జూనియర్ ఎన్టీఆర్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌లు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా వేర్వేరుగా పోస్టులు పెడుతూ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

లోకేశ్‌ పరామర్శ

కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించినట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నానని పేర్కొన్నారు. “బాలా మావయ్య త్వరగా కోలుకుని, యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

గర్జించాలని అభిలషిస్తున్నా: ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్పందిస్తూ.. “బాలా బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నాను” అని రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ ట్వీట్..

యాక్షన్ మోడ్‌లోకి రావాలి: కల్యాణ్‌రామ్‌

నందమూరి కల్యాణ్‌రామ్‌ స్పందిస్తూ.. “బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు.

ప్రస్తుతం బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించగా, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అభిమానులు , చిత్రబృందం ఆయన త్వరలోనే పూర్తి కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

Follow Us
టైఫాయిడ్, సైన్ ఫ్లూ‌కు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో
టైఫాయిడ్, సైన్ ఫ్లూ‌కు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో
గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే?
గోంగూర నల్లిబొక్కల కర్రీ.. ఇంట్లోనే జ్యూసీగా ఎలా చేయాలంటే?
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?