సినిమాలకైతే సెన్సార్ బోర్డు ఉంది గానీ.. ఓటీటీలకు అలా కాదు. ఈ మధ్యకాలంలో ఏ ఓటీటీలోకి వెళ్లినా లెక్కలేనన్ని బోల్డ్ చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇంగ్లీష్ డైరెక్టర్లు బోల్డ్ సీన్స్‌తో పాటు కొంచెం కాన్సెప్ట్‌ను సైతం జోడిస్తారన్నది తెలిసిందే. సో ఇంగ్లీష్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సజెషన్. ఇది బోల్డ్ చిత్రమే కానీ.. కామెడీ కూడా మిక్సై ఉంది. ఇందులో 30 ఏళ్ళ యువతి 19 ఏళ్ళ అబ్బాయికి రొమాంటిక్ విషయాలను నేర్పిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతీ సీన్ ఓ డైమండ్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెల్సా.?
ఈ బోల్డ్ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. దిగ్గజ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సోనీ లివ్‌లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. జెన్నీఫర్ లారెన్స్, ఆండ్రు బార్త్ ఫెల్డ్ మాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీన్ సుప్నిట్‌స్కై తెరకెక్కించిన ఈ చిత్రం 2023, జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా కామెడీ మూవీ స్టార్‌గా జెన్నిఫర్ లారెన్స్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు కూడా వరించింది.
స్టోరీ ఏంటంటే.. హీరో పేరెంట్స్ చాలా రిచ్. తమ 19 ఏళ్ల కొడుకు జనాలతో కలవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా.. ఓ పెట్ స్టోర్‌లో పని చేస్తుండటంతో చూసి అలసిపోతారు. పైగా అతడు చిలిపి పనులకు కూడా దూరంగా ఉంటుండటంతో ఓ యాడ్ ఇచ్చి.. తన కుమారుడికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటే కారు గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటిస్తారు. అలా 30 ఏళ్ల హీరోయిన్‌ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు హీరో తల్లిదండ్రులు. ఇక హీరోయిన్, హీరో జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? ఆ తర్వాత ఏం జరిగిందన్నది మీరు సినిమా చూడాల్సిందే. ఇది బోల్డ్ మూవీ కాబట్టి సింగిల్‌గా మాత్రమే చూడండి.
ఇది చదవండి: లిప్‌లాక్స్‌తో ఛాన్స్‌లు మిస్.. ఒక్క మూవీతోనే తిరుగులేని స్టార్‌డమ్.. ఈ గ్లామర్ డాల్ ఎవరో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి