
ప్రముఖ నటి జయసుధ తన సినీ జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను, దివంగత దిగ్గజ నటులైన శోభన్ బాబుతో తన అనుభవాలను పంచుకున్నారు. శోభన్ బాబును ప్రస్తుత తరం వారు చాలా మంది నేరుగా చూడలేదని, ఆయన ఎంత అందంగా ఉండేవారో వివరించారు. శోభన్ బాబు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో స్త్రీలతో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అందుకే ఆయనకు అపారమైన మహిళా అభిమానులుండేవారని, హీరోయిన్లు సైతం తమ వ్యక్తిగత సమస్యలను ఆయనతో స్వేచ్ఛగా పంచుకునేవారని జయసుధ వెల్లడించారు. శోభన్ బాబు వారికి మంచి సలహాలు ఇచ్చి, సౌకర్యవంతంగా ఉండేలా చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్
తన కెరీర్ మొదట్లో కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ లాంటి తన తండ్రి వయసున్న సీనియర్ నటులతో నటించాల్సి వచ్చిందని జయసుధ వివరించారు. రామారావుతో తనకు దాదాపు 35 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండేదని తెలిపారు. ఈ వయసు అంతరం కారణంగా క్లోజ్ సీన్లలో, ముఖ్యంగా నడుము మీద చెయ్యేసే వంటి సన్నిహిత సీన్లలో నటించడం ఇబ్బందికరంగా ఉండేదని ఆమె పంచుకున్నారు. “రాత్రంతా నువ్వే నా కలలో వచ్చావు” లాంటి డైలాగులు చెప్పమని అడిగినప్పుడు, ఆ వయసులో ప్రేమ, సిగ్గు లాంటి భావాలు ఎలా వ్యక్తపరచాలో తెలియక నవ్వేసేదాన్నని జయసుధ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటినుంచి తాను స్వతహాగా ప్రశ్నించే స్వభావం కలదాన్నని జయసుధ పేర్కొన్నారు. సెట్లలో నటీనటుల పట్ల, ఇతర సిబ్బంది పట్ల జరిగే వివక్ష, వ్యత్యాసాలను చూసి “వాళ్ళకెందుకు చికెన్, మాకెందుకు ఒకే ఇడ్లీ” అంటూ నిర్మొహమాటంగా ప్రశ్నించేదాన్నని తెలిపారు. మాట్లాడకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఇంట్లో చెప్పినప్పటికీ, తాను ఉన్నది చెప్పకుండా ఉండలేనని, తన అభిప్రాయాలను కమ్యూనికేట్ చేయకుండా ఉండలేనని జయసుధ అన్నారు.
ఇది చదవండి: ‘అలా అనుకుంటే ఎన్టీఆర్‌ను అడ్డంపెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని..’
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..